
అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను. —మత్తయి 8:13
అనేక సంవత్సరముల క్రితము నేను నా గతములో అనుభవించిన లైంగిక వేధింపులను బట్టి ఎంతో ప్రతికూలత భావనతో ఉండేదానిని. దీని ఫలితముగా ప్రజలు నన్ను గాయపరుస్తారని ఉహించాను మరియు అదే జరిగింది. నేను ప్రజలు నిజాయితిగా ఉండరని అనుకున్నాను మరియు అలాగే జరిగింది. ఏదైనా మంచి జరుగుతుందని ఆశించుటకు నేను భయపడ్డాను.
ఏదైనా మంచి జరుగుతుందని ఆలోచించి గాయపరచబడకుండ ఉండాలని నన్ను నేను భద్రపరచుకోవాలని తలంచి యున్నాను. కానీ నేను దేవుని వాక్యమును నిజముగా ధ్యానించుట మరియు నా జీవితమును పునరుద్ధరించమని దేవునిని అడుగుట ప్రారంభించినప్పుడు, నా ప్రతికూలత యంతయు పోతుందని నేను గుర్తించి యున్నాను.
మత్తయి 13వ అధ్యాయములో, నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసు చెప్పాడు. నేను అన్నిటిని ప్రతికులముగా నమ్మాను అలాగే నా జీవితములో అనేక ప్రతికూల సంఘటనలు సంభవించాయి. నా జీవితములో అనుకూల విషయాలు జరగాలని కోరుకొనుట నిర్ణయించుకున్నాను కాబట్టి నేను దేవునిలో విశ్వాసముంచుట ప్రారంభించి యున్నాను మరియు ఆ విధముగానే అనుకూల ఫలితాలు రావడం ప్రారంభించాయి!
మీరు స్థిరముగా ప్రతికూల ఆలోచనలను కలిగియుంటున్నారా మరియు ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? ఒకవేళ మీరు విభిన్న విషయాల మీద నమ్మిక యుంచుట ప్రారంభించవలసి యున్నదేమో. దేవుని యందు నమ్మిక యుంచుట ప్రారంభించండి మరియు ఉత్తమమైన దాని కొరకు నమ్మిక ప్రారంభించండి. మీ విశ్వాస పరిమాణము ప్రకారముగా ఆయన పని చేయునని ఎదురు చూడండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మా, నేను ప్రతికూలతలన్నిటి నుండి విడిపించబడవలెనని మరియు ఉత్తమ విషయాలను నమ్ముట ప్రారంభించండి. మీరు నా జీవితములో గొప్ప కార్యములను చేయగలరని నమ్ముతూ విశ్వాసములో కదిలించబడుటకు సహాయం చేయండి.