
విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. —ప్రసంగి 5:3
ఫలవంతము కాని “పనులను” చేసున్నావా? మీ విస్తారమైన పనులు మీ సమాధానమును దొంగిలిస్తున్నాయా?
నేను ఒకసారి ఇంగ్లాండ్ లో బకింగ్హాం పాలస్ లో ఒక ఖచ్చితమైన స్థలమును కాపలా కాచే ఒక గార్డును గురించి విన్నాను. 100 సంవత్సరాలకు ఒకరోజులో 24 గంటలకు ఆ స్థలమునకు కాపలా ఉండాలి.
చివరకు ఒకరు అడిగారు, “నీవు దేనిని కపాలా కాస్తున్నావు?” అతనికి ఏమీ తెలియదు మరియు అతడు కేవలం 100 సంవత్సరాలకు కాపలా కాయుటకు పని అప్పగింప బడిందని చెప్పాడు.
ఆ 100 సంవత్సరాల క్రితము రాణి నాటిన కొన్ని గులాబీ పొదలు పెరగాలని ఆశించింది. ఇప్పుడు ఒక శతాబ్దము తరువాత, ఒకసారి ఆ గులాబీ పొద ఉన్న చోట ఇప్పుడు గార్డు ఉన్నాడు – దేనిని కాపలా కాయుటలేదు.
మీరు ఏమి చేస్తున్నారో తెలియకే చేస్తున్న పనులేవైనా ఉన్నాయా? మనము పనులతో బిజీగా ఉండుటకు పిలవబడలేదు. మనము ఫలించునట్లు దేవుడు పిలిచి యున్నాడు. అనవసరమైన పనులు ఫలమును ఫలించవు మరియు ఒత్తిడిని పెంచుతాయి.
మీరు రోజంతా ఏమి చేస్తారో దాని జాబితా తీసుకొనుమని మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మిమ్మును చేయమని చెప్పని దానిని మీరు చేస్తూ ఉండవచ్చు లేదా ఆయన చేయమని చెప్పిన దానిని చేయకుండా ఉండవచ్చు. మీ తీరిక లేని పనుల నుండి విడిపించ బడుట మరియు ఎక్కువ ఫలము ఫలించుట నాకు చూపించుము.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నేను నా జీవిత జాబితాను తీసుకొని గుర్తింపులేని క్రియలను తీసివేయుము. నేను పనులతో విసిగిపోవాలని ఆశించుట లేదు. అధిక ఫలవంతమైన జీవితమును ఎలా జీవించాలో నాకు చూపించుము.