దేవుని రాజ్యము (ఒకరు ఇష్టపడే) భోజనమును పానమును (పొందుట) కాదు గాని, నీతియు (దేవుని అంగీకర యోగ్యముగా ఉండుట) సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది —రోమా 14:17
రోమా 14:17లో దేవుని రాజ్యము మంచి జీవితము, సమాధానము మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నదని నిర్వచిస్తుంది.
మనము దేవుని రాజ్యమును వెదకవలసి యుండగా, అనేక మంది ప్రజలు అనేక రకాల వస్తువులను వెదకుతూ ఉంటారు. నీతియు, సమాధానమును మరియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమును గురించి ఆలోచించినట్లైతే వారు దేనిని కలిగి యుండరు ఎందుకంటే వారు ఇతర విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు.
నేను అన్ని రకాల లోకపరమైన వస్తువులను కలిగియున్న యెడల నాకు ఏ చింత ఉండదు మరియు నా జీవితము సమాధానముగా ఉంటుందని ఆశించే దానిని, కానీ నేను ఎంత గొప్ప వస్తువులను సంపాదించినా అది నాకెన్నడూ సమాధానమును తీసుకొని రాదు. నిజమైన శాంతి దేవునితో ఉండే వారికే కలుగుతుంది.
దీనిని అర్ధం చేసుకొనుట మనకు ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకనగా మన నిజమైన నిధియైన యేసు మనతో యుండగా క్రైస్తవులలో అనేక మంది తప్పుడు వస్తువుల కొరకు వెదకుతూ ఉంటారు.
కాబట్టి ఈరోజు నీవు దేని కొరకు వెదకుతున్నావు? మీ నిధి ఏమిటి? లోకపరమైన వస్తువులు మిమ్మల్ని చివరకు అసంతృప్తిగా ఉంచుతాయి కానీ మీరు దేవునిని ఆయన నీతిని, సమాధానము మరియు ఆనందమును వెదకిన యెడల మీరు సంపూర్ణ సంతృప్తి మరియు దేవుడు ఆశించిన జీవితాన్ని మీరు కలిగి యుంటారు. ఈరోజే ఆయనను వెదకండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నాకు సంతృప్తిని ఇవ్వని లోకపరమైన విషయాలను గురించి వెదకుట నేను ఆపి వేయాలని నిర్ణయించుకున్నాను. నేను మీతో ఏకమై యుండాలని ఆశిస్తున్నాను కాబట్టి నేను మీ నీతిని, సమాధానమును మరియు ఆనందమును వెదకుచున్నాను.