మీరెప్పుడైనా ప్రవేశించ వచ్చును

మీరెప్పుడైనా ప్రవేశించ వచ్చును

…ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును (స్వేచ్చతో భయము లేకుండా మనము దేవుని వద్దకు ప్రవేశించుట) ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.  —ఎఫెసీ 3:12 

దేవుడు మనము భయములేని, ఆత్మ విశ్వాసము కలిగి ధైర్యముగా అయన కృపా సింహాసనము వద్దకు వచ్చుటకు అయన మనకు అనుమతిని అనుగ్రహించియున్నాడు. వాస్తవముగా, మనము ఎఫెసీ 3:12లో ఆయన సన్నిధిలోనికి స్వేచ్చగా ప్రవేశించగలమని ప్రోత్సహించబడ్డాము.

క్రీస్తులో మన సంబంధము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. కానీ ఈ లేఖనము మనకు తెలియజేయునదేమనగా మనము క్రీస్తులో దేవుని నీతియై యున్నాము కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మరియు అన్ని సమయాల్లో మనలను అయన అంగీకరిస్తాడని మనము నిశ్చయతను కలిగి యున్నాము మరియు మనకు సహాయము, క్షమాపణ అవసరమైనప్పుడు అయన వాటిని మనకు ఉచితముగా అనుగ్రహించును. అన్నింటికీ మరియు మనకు అవసరమైన సమస్తమునకు, మనము దానిని చేయవలసిన అవసరత వచ్చినప్పుడు ఆయన వద్దకు మనము వెళ్ళగలము.

మనము ప్రతి రోజు వెళ్ళుట మరియు వచ్చుటయనే ఆధిక్యతతో 200 సార్లు మనము దేవుని వద్దకు వెళ్ళగలము. మనము తలుపు తడితే ఎవరైనా తలుపు తీసేంత వరకు గుమ్మము వద్ద వేచి యుండి లోపలికి రమ్మని పిలిచినప్పుడే రావాలని దేవుడు మనకు ఎప్పుడు చెప్పలేదు.

ఒకవేళ “మీకొక విషయం తెలుసా? మీరు ఏ సమయంలోనైనా ప్రవేశించవచ్చు” అని మీ స్నేహితులలో ఒకరు చెప్పారను కుందాము. మీరు రాత్రి పగలు లేకుండా ఏ సమయంలో నైనా ప్రవేశించుటకు అనుమతి పొంది యున్నారు కనుక మీరు కేవలం  అడగకుండా లోపలికి వెళ్ళవచ్చును!

ఇప్పుడు మీరు ఆలోచించండి… మీరు ఆలోచించకుండా అనగా మీరు జగ్రత్త వహించవలసిన అవసరం లేకుండా అని దేవుడు మీతో చెప్పినట్లయితే, మీరు ప్రవేశించుటకు ఏ ఆటంకము లేదని అర్ధము. ఒకవేళ మీరు ఏవైనా పొరపాట్లు చేసి యున్నట్లయితే లేక మీరు చేయకూడని పనులు చేసినట్లైతే మీ పాపములను మీరు ఒప్పుకొని యేసు రక్తములో శుద్ధి చేయబడి ధైర్యముతో అయన సన్నిధిలోనికి ప్రవేశించ వచ్చును.

ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను మీ సన్నిధికి ఏ సమయంలోనైన ప్రవేశించుట యనునది మరియు మీరేల్లప్పుడు నాతో ఉంటారనే విషయం ఎంతో అద్భుతం. ఈ ఆధిక్యతను బట్టి నేనెంత కృతజ్ఞత కలిగియున్నాను మరియు మీ సన్నిధికి వచ్చుటకు నన్ను ప్రోత్సహించి నందుకు నేను మీకు కృతజ్ఞతను కలిగి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon