మీ అధికారమును ఉపయోగించుకొనుము!

మీ అధికారమును ఉపయోగించుకొనుము!

ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. —లూకా 10:19

మనమెప్పుడూ ఒత్తిడితో కూడిన పరిస్థితులతో వ్యవహరిస్తామని యేసు మనకు ఎప్పుడూ చెప్పలేదు. యోహాను 16:33లో ఆయన …. లోకములో మీకు శ్రమ, నిరాశ మరియు ఒత్తిడులు కలుగును… కానీ ఆయన ఈ లోకమును జయించి యున్నాడు కాబట్టి మీరు సంతోషించుడని మనకు అభయ మిచ్చియున్నాడు.

ఈ వచనము మనకు బోధించుచున్నదేమనగా మనము లోకము ఒత్తిడితో బాధ పడుచున్నట్లుగా మీరు బాధ పడనవసరం లేదు. ఎందుకనగా మనకు హాని కలుగజేసే లోకపు శక్తిని ఆయన జయించి యున్నాడు గనుక మనము ఇహలోక సవాళ్ళను నిశ్చలముగా మరియు ఆత్మ విశ్వాసముతో ఎదుర్కొన గలము.

లూకా 10:19 ఇలా చెప్తుంది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. ఇక్కడ యేసు మనతో యేసు ఎలా ఈ లోకమును జయించి యున్నాడో అలాగే మనము కూడా జయించుటకు మనలను సిద్ధపరచి యున్నాడని చెప్పబడింది.

మనమందరమూ ఎల్లప్పుడూ సవాలుతో మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, వాటితో వ్యవహరించుట అంత సులభము కానప్పటికీ మనం విషయాలను సరైన మార్గంలో- క్రీస్తు మార్గంలో నిర్వహిస్తే ఏవియు మనల్ని ఓడించలేవని యేసు భరోసా ఇచ్చాడు. క్రీస్తులో మీకు ఉన్న అధికారాన్ని ఉపయోగించుకోండి మరియు మీ అడ్డంకులను అధిగమించండి!


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను క్రీస్తులో కలిగియున్న అధికారమును మరియు శక్తిని పొందుకుంటాను. మీ అధికారములో ఎలా నడవాలో మరియు యేసు జయించినట్లుగా శోధనలను మరియు సవాళ్ళను జయించుట నాకు చూపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon