
యేసు జవాబిచ్చెను, “యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.” —యోహాను 14:23
జీవితం తీరిక లేకుండా ఉంది మరియు పరధ్యానంతో నిండి ఉంది. మన జాగ్రత్తలు, పనులు మరియు ఆందోళనల్లో చిక్కుకోవడం చాలా సులభం.
యేసు పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మరియ మరియు యోసేపు పస్కా కోసం యేసును యెరూషలేముకు తీసుకు వెళ్ళినప్పుడు లూకా 2వ అధ్యాయంలో చివరలో ఆసక్తికరమైన కథ ఉంది. పండుగ ముగిసిన తరువాత, వారు ఇంటికి వెళ్ళటానికి బయలు దేరారు, ఆయన వారితో ఉన్నాడనే అనుకున్నాడు.
దేవుడు మనతో ఉన్నాడని ఆలోచిస్తూ మనము మన సొంత పనులు చేయుటలో నిమగ్నమై యుంటాము.
ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన భాగం. యేసు వారితో లేడని గుర్తించక ముందే మరియ మరియు యోసేపు ఒక రోజు ప్రయాణం చేసారు, మరియు అప్పుడు ఆయనను కనుగొనుటకు మూడు రోజులు పట్టింది.
మూడు దినములు! ఇక్కడ సందేశము మనము కోల్పోయిన దానిని తిరిగి పొందడము కంటే దేవుని ప్రత్యేకమైన ఉనికిని కోల్పోవడము సులభం.
దేవుని సన్నిధిలో ఉండటానికి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మన పనులు చేస్తున్నప్పుడు, మన హృదయాల్లో దేవుడు తన గృహములో ఉన్నట్లు భావించునట్లు చేయుదము.
ఇది కేవలం తన వాక్యానికి విధేయత చూపడంతో మొదలవుతుంది. దేవునికి అవమానకరమైన ప్రవర్తన నుండి వెనుకకు తిరుగుటయే ఒక ఆత్మీయ పరిపక్వత యొక్క ప్రథమ చిహ్నం. ఇది ఆయన మీ గురించి ఏమనుకుంటున్నాడని మీరు పట్టించుకొనునట్లు చూపిస్తుంది.
మీరు ఇతరులపై ఉదారంగా ఉండాలని ఎంచుకున్నట్లయితే, మీరు క్షమించాలని నేర్చుకుంటారు, మీ గాయములను వెళ్లగొట్టి శాంతితో నివసించండి. మనము మన మాటలు ఉద్దేశపూర్వకంగా ఉండాలని, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని మరియు ఇతరులను ఘనపరచాలని మనము ఎన్నుకొనిన యెడల మనము రోజంతా దేవునితో అనుసంధానం కలిగి యుంటాము.
ప్రారంభ ప్రార్థన
తండ్రీ, నా హృదయమును మీ గృహముగా చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మీ సన్నిధి నాకు కావాలి. ప్రభువా నా ఆలోచనలు మరియు నా మాటలతో మిమ్మును గౌరవించటానికి మరియు నా చుట్టూ ఉన్నవారికి ఒక ఆశీర్వాదంగా ఉండటానికి నాకు సహాయం చెయ్యండి.