
గాలి తన కిష్టమైన చోటను (ఊదును) విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. (యోహాను 3:8)
మనము తిరిగి జన్మించినప్పుడు, మన ఆత్మలలో జీవన్ని కలిగి యుంటాము మరియు మనము దేవుని స్వరమును వినుటకు సిద్ధంగా ఉంటాము. మనము మెల్లని స్వరము ఎక్కడినుండి వస్తుందో తెలియక పోయినా దానిని వింటాము. మన హృదయాలలో నిశ్చలమైన, మెల్లని స్వరంతో మనలను దోషిగా నిర్ధారించడానికి, సరిదిద్దడానికి మరియు నిర్దేశించడానికి ఆయన మృదువుగా మాట్లాడతాడు.
మనం మన నోరు, ముఖ కవళికలు, హావభావాలు మరియు అన్ని రకాల శరీరక భాషలను ఉపయోగించి మనుషులతో కమ్యూనికేట్ (సంభాషణ) చేయవచ్చు, కానీ మనం దేవునితో సంభాషించాలనుకున్నప్పుడు, మన ఆత్మలో అలా చేయాలి.
దేవుడు మన అంతరంగ జీవముతో ప్రత్యక్ష సాంగత్యం ద్వారా, అంతర్ దృష్టి ద్వారా (వివరించలేని వివేచన భావం), మరియు మన మనస్సాక్షి ద్వారా (మంచి మరియు చెడుల యొక్క మన ప్రాథమిక ఒప్పుకోలులు) మరియు సమాధానము ద్వారా మాట్లాడతాడు. మన సహజ మనస్సులు అర్థం చేసుకోలేని మరియు గ్రహించలేని విషయాలను మన ఆత్మలు తెలుసుకోగలవు.
ఉదాహరణకు, మనం దేవుని స్వరానికి సున్నితంగా ఉన్నప్పుడు, సరైనదిగా కనిపించే పరిస్థితిని మనం చూడవచ్చు, కానీ దానిలో ఏదో తప్పు ఉందని మనకు అకారణంగా తెలుసు. మన ఉత్సాహంలో ఉన్న ఆ “సరిచేసుకోవడం” అనేది మనం ఏకీభవించకూడని వారితో లేదా మనం పాల్గొనకూడని దానిలో పాలుపంచుకోకుండా ఉండేందుకు ఉద్దేశించబడింది.
మీ హృదయంలో మీరు భావించే విషయాలపై శ్రద్ధ వహించండి మరియు మీ ఆత్మలో అర్థం చేసుకోండి ఎందుకంటే అక్కడ దేవుడు మీకు దిశానిర్దేశం, ప్రోత్సాహం, హెచ్చరిక మరియు ఓదార్పు మాటలు చెప్తాడు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ ఆత్మలో “సరిచేసుకోవలసిన” వాటి మీద దృష్టినుంచండి.