మీ ఆనందమునకు బాధ్యత వహించుము

మీ ఆనందమునకు బాధ్యత వహించుము

 కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని. —ప్రసంగి 3:12

నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠములలో ఒకటి ఏదనగా నన్ను ఆనందముగా ఉంచుటకు ఇతరుల మీద ఆధారపడను. మన స్వంత ఆనందమునకు మనమే బాధ్యత వహించే సామర్ధ్యమును దేవుడు మనకు ఇచ్చి యున్నాడు.

ఒక ఖచ్చితమైన వ్యక్తి లేక ఒక ఖచ్చితమైన విధానములో ప్రవర్తించకపోతే లేక ఒక పరిస్థితి వారికి అనుకూలము లేకపోతే  అనేక మంది ప్రజలు ఆనందముగా ఉండలేరు. ప్రతిరోజూ మన స్వంత ఆనందము ఇతర ప్రజలు మరియు పరిస్థితి మీద ఆధారపడి యుంటుంది, వాస్తవముగా చూసినట్లయితే మనము మన ఆనందమును ఆయనలో వెదకాలని ఆశిస్తున్నాడు.

మా సదస్సు ముగిసిన తరువాత రోజు డేవ్ గోల్ఫ్ ఆడటానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నేను చాల విచారపడే దానిని. నేను అతనితో కలిసి షాపింగ్ కు వెళ్ళాలని లేదా మూవీ చూడాలని ఆశించే దానిని. కాని దేవుడు నాకు చుపించినదేమనగా మనలో ఒక్కొక్కరము విభిన్న రీతులలో ఆనందమును పొందుకుంటాము.

అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, కానీ మనము ప్రజల మీద ఆధారపడుతూ మనము ఆనందముగా ఉండుటకు అవాస్తవిక కారణములను ఎదుర్కొంటూ ఉంటాము.


ప్రారంభ ప్రార్థన

దేవా, నా సంతోషము మీ మీద ఆధారపడి యుండవలెను, కానీ ఇతరుల మీద లేక పరిస్థితుల మీద కాదు. నేను కలిగి యున్న నా అవాస్తవిక అంచనాలను చూచుటకు నాకు సహాయం చేయండి తద్వారా నా స్వంత ఆనందమునకు నేను బాధ్యత వహిస్తాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon