మీ ఆలోచన మారనంత వరకు మీ జీవితం మారదు

మీ ఆలోచన మారనంత వరకు మీ జీవితం మారదు

మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.  —ఫిలిప్పి 4:8

నేను జీవించిన అనేక సంవత్సరములు సంతోషం లేకుండా బ్రతికి యున్నాను ఎందుకనగా నేను ఉదయమున నిద్ర లేచిన వెంటనే ప్రతికూల, విచారకరమైన, ఒత్తిడితో కూడిన విషయాలను గురించి ఆలోచించే దానిని. నాలో ఉన్న క్రీస్తు మనస్సుతో ఎలా జీవించాలనే విషయాన్ని నేను నేర్చుకున్నప్పటినుండి నేను పూర్తిగా సంతృప్తిని కలిగి యున్నాను.

ఒకవేళ నా వలె, మీరు కుడా తప్పుడు ఆలోచనలతో మీ సంవత్సరములు గడిపి యుండవచ్చు. శుభవార్త ఎదనగా, దేవుని సహాయముతో దానిని ఈరోజే మార్చవచ్చును.

మీరు ప్రతికూల ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే మీ ఆలోచనలు మారకపోతే మీ జీవితము మారదనే సత్యమును మీరు గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనది. మార్చబడుటకు నూతనపరచబడిన దేవుని వలె ఆలోచించుట అనునది ఎంతో బలమైనది.

మనము ఎటువంటి వాటిని గురించి ఆలోచించాలనే విషయాలను గురించి బైబిల్ ఎంతగానో ప్రభోదిస్తుంది.  ఫిలిప్పి 4:8 మనకు తెలియజేయునదేమనగా మనలను విరుగగొట్టుటకు కాకుండా నిర్మించుటకు అవసరమైన వాటిని గురించి ఆలోచించమని చెప్తుంది.

ఈరోజు మీకు సవాలు చేయాలని ఆశిస్తున్నాను. ఉదయమున నిద్ర లేచిన వెంటనే మీరు ప్రతికూల విషయాలను గురించి ఆలోచించుటకు బదులుగా ప్రతిరోజూ నిద్ర లేచిన వెంటనే అనుకూల వచనాలను తీసుకొని వాటిని ధ్యానించండి. దేవుని వాక్యము మీలో ఎదగనివ్వండి మరియు మీ మనస్సును రూపాంతరం చెందునట్లు అనుమతించండి. మీ మనస్సును మంచి విషయాల మీద నిలపండి మరియు తద్వారా వచ్చే దైవిక మార్పులలో ఆనందించండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను మార్పు నొంది క్రీస్తు మనస్సుతో జీవించుటకు సిద్ధంగా ఉన్నాను. మీకు చెందినదేదైనా – ఏది సత్యమైనదో, మాన్యమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతిగలదో, వాటి మీద ధ్యాన ముంచుటకు నాకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon