
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను… – ఫిలిప్పి 1:10
దేవుడు శ్రేష్టమైన వాడు. ఆయన ప్రతినిధులుగా, మనము కూడా అలాగే ఉండవలెను. మనం ఎందులో చేతులు పెడతామో వాటిలో మనము శ్రేష్టముగా పని చేయుట చాలా ప్రాముఖమైనది. మనము ఏ పనిని పూర్తి చేయాలని మనకు అప్పగింపబడిన దానిలో మనము ఉత్తమముగా పని చేయునట్లు పురికొల్పబడవలెను. ఏదైతే అత్యుత్తమమైనదో మరియు నిజమైన విలువ కలిగి యున్నదో దానికి విలువ నిచ్చుట నేర్చుకొనవలేనని పౌలు మనలను అర్ధిస్తున్నాడు (ఫిలిప్పి 1:10). మనము మన జీవిత విధానములో శ్రేష్టత కలిగి యున్నట్లైతే మనము దేవుని ఆనందమును కలిగి యుంటాము మరియు లోకమునకు మంచి ఉదాహరణలుగా ఉంటాము.
మనము శ్రేష్టమైన పంటను కోయాలంటే శ్రేష్టమైన దానిని నాటవలెను. మనము అత్యున్నత జీవితమును జీవించకుండా అత్యున్నత ఫలితముల కొరకు మనము ఎదురు చూడలేము. శ్రద్ధ, స్థిరత్వము మరియు నిశ్చయతను అభివృద్ధి చేయుట బైబిలు మనకు బోధిస్తుంది – మనందరము శ్రేష్ఠమైన జీవితాలను జీవించుటకు సహాయపడుతుంది.
దేవుడు మీ మార్గములో ఉంచిన ఏ ప్రాజెక్టులోనైనా లేదా ఏ ఆక్టివిటీ లోనైనా శ్రేష్టముగా పని చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. శ్రద్ధ కలిగి యుండండి. పనులను పూర్తి చేయకుండా వదలవద్దు, కానీ మీ సామర్ధ్యము కొలదీ మీరు ప్రారంభించిన దానిని పూర్తి చేయండి. మీ మనస్సును ధృడముగా నిర్ణయాత్మకముగా ఉంచండి. శ్రేష్టమైన ఫలితముల కొరకు మిమ్మల్ని మీరే సమర్పించుకోండి.
శ్రేష్టమైన వైఖరిని దేవుడు గౌరవిస్తాడు. ఉత్తమమైన పనిని చేయుటకు ఎంచుకోండి మరియు ఆయన ఎల్లప్పుడూ మీరు చేయు పనులలో మీకు శక్తిని అనుగ్రహించును.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని ఆశిస్తున్నాను. నేను ప్రతి పరిస్థితిలో శ్రద్ధ, స్థిరత్వము మరియు నిర్ణయాత్మకముతో ఉత్తమముగా పనిచేయునట్లు నన్ను బలపరచండి మరియు సహాయం చేయండి