మీ ఎత్తును ఎవరు మూరడెక్కువ చేసుకొనగలరు!

మీ ఎత్తును ఎవరు మూరడెక్కువ చేసుకొనగలరు!

మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? —మత్తయి 6:27

చింతించుట మనకు ఏ మాత్రమూ మంచి చేయదు. అది ఏ ఒక్కదానిని మార్చదు మరియు మనము మార్చలేని విషయాలను గురించి సమయమును వృధా చేసుకుంటాము – దేవుడు మాత్రమే మార్చగలడు.

మనము చింతించుట వలన మన ఎత్తును మూరడెక్కువ చేసుకోలేము. అయినను మనము చింతిస్తాము, చింతిస్తాము, చింతిస్తాము మరియు అది మనలను ఎక్కడికీ తీసుకు వెళ్ళదు.

మనము చింతించిన ప్రతిసారీ మనము ఎంతో శక్తిని తీసుకుంటాము, అలసిపోవునట్లు చేస్తుంది, ఆరోగ్యమును పాడుచేస్తుంది, మన ఆనందమును దొంగిలిస్తుంది మరియు ఏ ఒక్క పరిస్థితిని మార్చదు. దేవుడు మాత్రమే పరిష్కరించగల సమస్యలను మనము పరిష్కరించుట మానుకోవలసిన అవసరత ఉన్నది, ఎందుకంటే నేను దీనిని సాధించాను అని చప్పట్లు కొట్టుచు చెప్పేవాడు సాతానుడు ఒక్కడే.

యేసు యోహాను 14:27 లో నిశ్శబ్దముగా ఉండమని మరియు యోహాను 16:33 లో ఆనందించమని చెప్పాడు. మనము దీనిని చేసినప్పుడు ఇది సాతానుడికి తిరుగులేని దెబ్బగా మారుతుంది. మీరు సమస్తమును పరిష్కరించలేరని మీరు గుర్తించినప్పుడు అది మిమ్మల్ని నిరాశపరుస్తుంది మరియు దేవుడు చేయగలడని మీరు తెలుసుకొనినప్పుడు మీరు ఆనందిస్తారు!

కాబట్టి చింతపడవద్దు. బదులుగా నిమ్మళముగా ఉండండి, ఆనందముగా ఉండండి మరియు సాతానుడిని పరుగెత్తించండి!


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను చింతించుట ద్వారా నేనేమీ సాధించలేను, కాబట్టి నేను దానిని వదిలి వేస్తున్నాను. నేను పరిష్కరించలేని దానిని మీరు పరిష్కరించగలరు కాబట్టి నేను చాల వందనస్తురాలిని. మీరు నన్ను నిమ్మలపరచి ఆనందింప చేసియున్నారు!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon