
ఒకని యెడల ఒకడు దయగలిగి (కనికరముగల, అవగాహన, ప్రేమగల హృదయం), కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును (ఉచితముగా) క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీ 4:32)
క్షమించకపోవడం, ద్వేషం, పగ, లేదా ఏ రకమైన నేరం అయినా మనం కలిగి యున్నప్పుడు దేవుని నుండి వినలేము. ఈ విషయంపై దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మన పాపాలను మరియు ఆయనకు వ్యతిరేకంగా చేసిన నేరాలను క్షమించాలని మనం కోరుకుంటే, మనం ఇతరుల పాపాలను మరియు మనపై చేసిన నేరాలను క్షమించాలి.
ఎఫెసీయులు 4:30-32, లో ఈ రోజు కోసం మనము కలిగి ఉన్న వాక్యభాగంలో, మన హృదయాలలో కోపం, ఆగ్రహం మరియు శత్రుత్వం వంటి ప్రతికూల భావోద్వేగాలను కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మను దుఃఖపెడతాం అని బోధిస్తుంది. ఏ కారణం చేతనైనా మనం ఎవరిపైనైనా క్షమాపణ లేకుండా ఉన్నప్పుడు, అది మన హృదయాలను కఠినతరం చేస్తుంది మరియు మన జీవితాల్లో దేవుని నడిపింపు పట్ల సున్నితంగా ఉండకుండా నిరోధిస్తుంది.
క్షమించకపోవడం అంటే విషం తాగి శత్రువు చనిపోతాడని ఆశించడం లాంటిదని ఎవరో చెప్పడం విన్నాను. బహుశా అతని లేదా ఆమె జీవితాన్ని ఆస్వాదిస్తున్న మరియు మీరు కలత చెందుతున్నారని కూడా పట్టించుకోని వారి పట్ల మీ జీవితాన్ని కోపంగా మరియు చేదుగా ఎందుకు గడపాలి? మీకు మీరే సహాయం చేయండి – మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి! క్షమాపణ అనే బహుమతిని మీరే ఇవ్వండి. ఇది మీ హృదయానికి సమాధానాన్ని కలిగిస్తుంది మరియు దేవుని స్వరాన్ని వినడానికి మరియు మీ జీవితంలో ఆయన నడిపింపును అనుసరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మిమ్మల్ని మీరు క్షమించే బహుమతిని మీ కొరకు మీరే ఇవ్వండి.