ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. —ప్రసంగి 7:9
సమస్త కోపం, వాటి కారణంతో సంబంధం లేకుండా, మన జీవితాలపై అదే ప్రభావాన్ని చూపుతుంది. ఇది మనల్ని కలవరపెడుతుంది, దీనివలన మనము ఒత్తిడికి గురవుతాము. కోపాన్ని అదిమి ఉంచడం మరియు అది ఉనికిలో లేదని నటించడం మన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. ఎక్కువ సమయం మనం మనల్ని మాత్రమే బాధపెడుతున్నాం, మరియు మనకు కోపం తెప్పించిన వ్యక్తికి కూడా దాని గురించి తెలియదు.
నేను కోపముతో వ్యవహరించుట మరియు దానిని జయించుట దేవుడు నాకు చూపించక ముందు వరకు నేను కోపముతో చాలా శ్రమపడ్డాను. చివరకు నేను నా కోపమును తగ్గించుటకు అనుకూల మార్గమును నేర్చుకున్నాను. అది నాకు నూతన ప్రారంభమునకు స్థానంగా మారియున్నది.
మీరు మీ కోపమును ఎదుర్కొన్నప్పుడు దానిని దేవుని మార్గములో వ్యవహరించాలని నిర్ణయించుకున్నప్పుడు మీరు దానిని జయించగలరు. స్థిరముగా ఉండుటకు మరియు ఆత్మ ఫలములో నడచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని అనుగ్రహించును. మన జీవితములలో అన్యాయము చేసిన వారిని క్షమించుటకు మరియు ప్రేమించదగని వారిని ప్రేమించుటకు మనము శక్తిని కలిగి యున్నాము.
మన కోపము నిమిత్తము మనము బాధ్యత వహించాలి మరియు దానితో వ్యవహరించుట నేర్చుకోవాలి. మనము దానిని లోలోపల దాచుకొనుట కంటే దేవునిని వెదకుచు దానిని విడుదల చేయుటకు ఆయన సహాయము కొరకు అడగవలెను. దానిని తగ్గించుకోండి మరియు పరిష్కరించుకోండి మరియు ఒత్తిడి నుండి విడుదల పొందండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను నాలో ఎటువంటి కోపమును ఉంచుకోను ఎందుకనగా అది వెర్రితనము మరియు మిమ్మును సంతోషపరచదు. నా జీవితములో కోపమును జయించుటకు నేను మీ సహాయమును కోరుతున్నాను.