ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును… -లూకా 4:18
నేను దుర్వినియోగ నేపథ్యం నుండి వచ్చి అపాయకరమైన ఇంటిలో పెంచబడ్డాను. నా బాల్యం భయంతో మరియు వేదనతో నిండిపోయింది.
క్రీస్తు కోసం జీవించే క్రైస్తవ జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్న యౌవనస్థురాలిగా, నా గతం ద్వారా నా భవిష్యత్తు ఎల్లప్పుడూ నాశనం చేయబడుతుందని నమ్మాను. నా వంటి గతమును కలిగియున్నవారు నిజముగా ఎలా బాగుండగలరని నేను అనుకున్నాను? అది అసాధ్యం!
కానీ యేసు చెప్పాడు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది … ఆయన బంధించబడిన వారిని విడిపించుటకు నన్ను పంపియున్నాడు… యేసు చెరసాల తలుపులు తెరిచి బంధించబడిన వారిని విడిపించుటకు వచ్చియున్నాడు.
నేను నా గతమనే చెరసాల నుండి విడుదల చేయాలని దేవుడు కోరుకున్నాడని గ్రహింఛేంతవరకు నేను ఎటువంటి పురోగతిని చేయలేకపోయాను. నేను దానిని అనుమతించనంత వరకు నా గత లేదా నా ప్రస్తుత నా భవిష్యత్తు నేను నిర్దేశించలేనని నేను నమ్ముతున్నాను. నన్ను అద్భుతరీతిలో విడిపించమని దేవుణ్ణి అనుమతించవలసియున్నది.
ప్రతికూల మరియు నిరుత్సాహపరిచిన మార్గాల్లో మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తున్న దురదృష్టకరం గతంగా ఉండవచ్చు. కానీ నేను నిస్సంకోచంగా మీకు చెప్తాను, మీ భవిష్యత్తు మీ గతం లేదా మీ ప్రస్తుత ద్వారా నిర్ణయించబడదు! దేవుడు మీ గతం యొక్క బంధకాలను విడగొట్టనివ్వండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా గతం కంటే నీవు శక్తివంతంగా ఉన్నావు అని నేను నమ్ముతున్నాను. నాకు నీవిచ్చే స్వేచ్ఛను నేను పొందుకుంటున్నాను మరియు మీరు నా యెడల కలిగియున్న ప్రణాళికతో బ్రతకాలని ఆశిస్తున్నాను.