
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. —అపోస్తలుల కార్యములు 16:25-26
కొన్నిసార్లు మనము భయంకరమైన గందరగోళములలో ఉన్నట్లు కనుగొంటాము మరియు ఆ సమయంలో ఉపశమనం మరియు విడుదలకు వేచి యుండాలని ఆశించడం చాల కష్టం. కానీ, మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ తియ్యని మరియు తేలికైన విశ్వాసముతో ఆయన యందు విశ్వసముంచాలి. అప్పుడు, ఒక విధంగా మనం ఎన్నడూ కనుగొనలేని విధంగా -దేవుడు అకస్మాత్తుగా కదలుతాడు!
పౌలు మరియు సీలలకు వేచియుండుట గురించి తెలుసు మరియు వారు బాగుగా వేచి యున్నారు. అపోస్తలుల కార్యములు 16లో వారు జన సమూహము ద్వారా ఎలా దాడి చేయబడ్డారు, కొట్టబడ్డారు మరియు చెరసాలలో వేయబడ్డారనే విషయన్ని గురించి తెలియజేస్తుంది. 24వ వచనం తెలియజేయునదేమనగా చెరసాల నాయకుడు వారిని చెరసాలలో వేయించి వారి కాళ్ళకు బొండలు బిగించునట్లు ఆజ్ఞాపించాడు. వాటన్నిటినీ పౌలు మరియు సీలలు పట్టించుకోకుండా వారిద్దరూ ప్రభువును స్తుతించుట మొదలు పెట్టారు. వారు దేవునిలో వేచియుండుట ప్రారంభించి యున్నారు.
హఠాత్తుగా దేవుడు పెద్ద భుకంపమును కలిగించగా, చెరసాల తలుపులు తెరచుకున్నాయి మరియు బందీల సంకెళ్ళు ఊడిపోయాయి. ఆయన వారిని విడిపించాడు!
ప్రజలు ఆ భయంకరమైన పరిస్థితిలో సహనముతో మరియు ఎదురుచూపుతో దేవునియందు వేచియుండగా దేవుడు గొప్ప కార్యము చేసియున్నాడు. కాబట్టి దయచేసి వదిలి పెట్టవద్దు! నమ్ముట వదిలి పెట్టవద్దు! పూర్తి నిరీక్షణ మరియు ఆశతో నిలిచి యుండండి. దేవుని శక్తి మితిలేనిది మరియు ఆయన మీ కొరకు గొప్ప కార్యములు చేయును.
ప్రార్ధన స్టార్టర్
దేవా, నా గందరగోళములు ఎంత చెడ్డగా ఉన్నా, నా చెరసాలలో నిన్ను స్తుతించాలని ఎంపిక చేసుకొని యున్నాను. మీరు నా సహాయమునకై వస్తారని మరియు సరియైన సమయంలో నన్ను మీరు విడిపించుట “హఠాత్తుగా” వస్తారని నేనెరుగుదును.