మీ బలమునకు ఆధారము

మీ బలమునకు ఆధారము

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. (నిర్గమకాండము 15:2)

మనం ఈ రోజు వచనంలో చదువుచున్నటువంటి మోషే మరియు ఇశ్రాయేలీయుల వలె ఉండాలి. దేవుడు వారికి బలాన్ని మాత్రమే ఇచ్చాడని నేను ఎత్తి చూపాలనుకుంటున్నాను (పాత నిబంధన అంతటా మనం చూస్తాము), కానీ ఆయనే వారి బలం. మొదటి సమూయేలు 15:29 దేవున్ని “ఇశ్రాయేలు బలం” అని సూచిస్తుంది. మీరు చూడండి, ఇశ్రాయేలు వారి బలం దేవుడని ఒక సమయంలో తెలుసుకున్నారు, కానీ వారు మర్చిపోయారు. వారు ఈ ముఖ్యమైన సత్యాన్ని మరచిపోయినప్పుడు, వారు ఎల్లప్పుడూ ఒక దేశంగా విఫలమవడం మరియు పతనమవడం ప్రారంభించారు మరియు వారి జీవితాలు నాశనం కావడం ప్రారంభించాయి. వారు తమ శక్తిగా దేవుని వైపు తిరిగినప్పుడు, వారి పరిస్థితులు మారి పోయాయి.

దేవుడు మీ బలమని మీకు తెలిసినప్పటికీ, మీరు దానిని విశ్వాసం ద్వారా పొందాలి. నేను ఆయనను తప్ప నేను ఏమీ చేయలేనని మరియు నన్ను స్థిరపరచడానికి మరియు బలపరచడానికి నేను పూర్తిగా ఆయనపైనే ఆధారపడతానని దేవునికి చెప్పడం ద్వారా నేను ప్రతిరోజూ ప్రారంభించాను. మనకు అవసరమైనప్పుడు మనల్ని ప్రోత్సహించే లేదా మనకు దిశానిర్దేశం చేసే మాట మాట్లాడడం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తాడు. వివేకం మరియు అంతర్దృష్టితో కూడిన మాటలు మాట్లాడడం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తాడు. మనం అలసిపోయినప్పుడు లేదా సొలసిపోయినప్పుడు మనకు అసాధారణ శక్తిని ఇవ్వడం ద్వారా శారీరకంగా కూడా బలపరుస్తాడు మరియు కష్టమైన వ్యక్తులను మరియు పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇస్తాడు.

మీ కొరకు మీరే పరిస్థితులను చక్కపరచడానికి ప్రయత్నించడం కంటే దేవున్ని మీ శక్తిగా విశ్వసించండి. చాలా మంది వ్యక్తులు మీపై ఆధారపడి ఉండవచ్చు మరియు మీరు దేవునిపై ఆధారపడినప్పుడు మాత్రమే మీరు వారికి సహాయం చేయగలరు. ఈరోజు ఆయనను విశ్వాసంతో మీ జీవితానికి బలంగా స్వీకరించండి మరియు మీరు సులభంగా సాధించగలిగే వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడే మీ బలమగును గాక.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon