మీ బూడిదను ఆయనకు ఇవ్వండి

మీ బూడిదను ఆయనకు ఇవ్వండి

 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు. —కీర్తనలు 103:12

మన తండ్రి మన గందరగోళములను తీసుకొనునట్లు అనుమతించినట్లైతే ఆయన వాటిని అద్భుతములుగా మార్చగల సమర్ధుడు మరియు మనము ఆయనయందే నమ్మిక యుంచినట్లైతే మన పొరపాట్లను మన మేలు కొరకే మార్చగలడు.

యెషయా 61:3 లో ఆయన బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తానని చెప్పాడు, కానీ చాల మంది ప్రజలు తమ బూడిదను, గత కాలపు కాలిన బొగ్గులను తమ తప్పులు మరియు పతనములకు గుర్తుగా తమ తోనే ఉంచుకుంటారు. మీ బూడిదను తీసి వేసి ఏదైనా నూతన విధానమును పట్టుకొనుమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

చాలామంది ప్రజలు వారికి మరొక అవకాశం లేనట్లు వారి గతములో జీవిస్తూ ఉంటారు. మీకు రెండవ అవకాశము కావాలా? మీరు దేవునిని రెండవ లేక మూడవ లేక నాలుగవ – లేక మీకు అవసరమైనన్ని అవకాశముల కొరకు అడగండి. దేవుడు కృపతో మరియు సహనముతో నిండి యున్నాడు. ఆయన దయగల ప్రేమ ఎన్నడూ విఫలమవ్వదు లేక ముగించబడదు. ఆయన మీ నుండి మీ అతిక్రమములను దూరపరచి యున్నాడు కాబట్టి మీరు వాటిని పట్టుకొని వ్రేలాడవలసిన అవసరం లేదు.

యేసు మన భారములను మోయుటకు వచ్చియున్నాడు, కానీ వాటిని వెళ్ళగొట్టుటకు మరియు మీ పొరపాటుల కంటే ఆయనే గొప్పవాడని నమ్ముటకు మీరు సిద్ధంగా ఉండాలి. ఈరోజు మీ బూడిదను ఆయనకు ఇవ్వండి.

ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నాతో ఒక తాజా అవకాశముతో మీరు ప్రేమతో నా ముందు నిలబడినప్పుడు, నేను నా గతముతో వ్రేలాడుతుంటే అది నాకేమాత్రమూ మంచి చేయదు. కాబట్టి నేను నా బూడిదను వెళ్ళ గొడతాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon