
ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు (మీ భారములు, మీ బాధ్యతలు, చింత మరియు ఆత్రుతలు అన్నింటినీ ఒక్కసారే ) ఆయన మీద వేయుడి.- 1 పేతురు 5:7
“మీ స్వంత హృదయమే సత్యమై యున్నది” అనే ఒక పాత సామెత కలదు. మనమందరమూ బాగుగా గుర్తుంచు కొనునట్లు ఇది సమయానుకులమైన మరియు సందర్భానుసార జీవిత పాఠముగా నిలిచిపోతుంది. మనము మనలను అనుసరించాలని మన హృదయము సలహా ఇస్తున్నప్పుడు, మన జీవితములను మనము కష్టతరం చేసుకుంటాము.
ఇప్పుడు నేను స్వార్ధపరమైన కోరికలను గురించి మాట్లాడటం లేదు. నేను దేవుడు మీ హృదయంలో ఉంచిన కోరికలను గురించి మాట్లాడుతున్నాను. మీ జీవితములో నుండి ఏమి ఆశిస్తున్నారు? మీ విషయంలో దేవుని చిత్తమును గురించి ఏమి విశ్వసిస్తున్నారు? మీరు దానిని పొందుకుంటున్నారా?
కొంత మంది ప్రజలు అనేక బాధ్యతలు మరియు చింతలను కలిగియున్నారు తద్వారా వారు వారి హృదయములో ఏమున్నదో గ్రహించి దానిని అనుసరిస్తున్నారు. అది వారి సమీపములో లేదని నిర్ణయించుకున్నారు.
మీ చింత యావత్తు దేవుని మీద వేయండి మరియు ఆయనే మిమ్మును ఆదుకొనును అని బైబిల్ చెప్తుంది. మీరు కలిగి యున్న ఏ చింతయైనా మీ హృదయమును అనుసరించకుండా ఆపుతుంది గనుక మీరు దానిని దేవునికి అప్పగించి ఆయనే దానిని చూచుకొనునట్లు అనుమతించండి.
దేవుడు మీలో ఉంచిన వాంఛలను అనుసరించాలని ఆశిస్తున్నాడు. దేవుడు మీ చింతలను మోయునట్లు అనుమతించండి మరియు మీ హృదయమును అనుసరించండి. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, కొన్నిసార్లు, నా చింతలు మరియు భారముల వలన నీవు నా హృదయములో ఉంచిన దానిని గ్రహించలేక పోతున్నాను కాబట్టి నేను వాటిని మీకు సమర్పిస్తున్నాను. నీవు వాటిని చూసుకుంటావని నాకు తెలుసు మరియు నా హృదయమును అనుసరించుటకు స్వేచ్చగా ఉండమని నీవు నా నుండి కోరుతున్నావు.