
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. —ఎఫెసీ 2:10
దేవుడు మిమ్మల్ని మీ వాగ్ధాన భూమికి నడిపించాలని ఆశిస్తున్నాడు… దేవుడు మీ కొరకు ముందుగానే ఏర్పరచిన మేలుకరమైన జీవితమును మీరు జీవించునట్లు మీరు క్రీస్తులో తిరిగి సృష్టించబడ్డారు, తిరిగి జన్మించారు. కానీ ఆ జీవితములోనికి వెళ్ళునట్లు దేవుని అనుసరించాలంటే, ఆయన మిమ్మును ముందుగా సిద్ధపరచవలెను మరియు దీని అర్ధమేదనగా ఎదో ఒకటి మారవలసి యున్నది.
ఇప్పుడు, మార్పు అనే మాటను గురించి భయపడవద్దు; దీని అర్ధమేదనగా మీరు ఇప్పుడు చేయుచున్న దానిని ఆపివేసి, మీరు చేయని దానిని చేయుట ప్రారంభించుట. ఉదాహరణకు, వ్యతిరేక ఆలోచనలు ఆలోచించుట మానివేసి అనుకూల ఆలోచనలు ఆలోచించుట ప్రారంభించుట… మీ సౌకర్యవంతమైన పరిస్థితిలో నుండి బయటికి వచ్చుట మరియు పడవలోనుండి అడుగు బయట పెట్టుట… చేసే పనినే చేస్తూ ఉండకుండా నూతన అవకాశములను తీసుకొనుట ప్రారంభించుట.
వాగ్ధాన భూమిని గురించి చదువుట మరియు మాటలాడుట సరిపోదు. మీ వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొనుటకు నిర్ణయించుకోండి. దేవుడు మంచివాడు; అయన మిమ్మల్ని అక్కడికి నడిపించును. కేవలం అనుసరించుటకు సిద్ధంగా ఉండండి మరియు దేవుడు మిమ్ములను ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు అయన మిమ్మును సిద్ధ పరచుచుండగా దేవుడు మీ జీవితములో తీసుకొని వచ్చే మార్పులను అంగీకరించుటకు మీరు సిద్ధంగా ఉండండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మ, నా వాగ్ధాన దేశమును నేను స్వతంత్రించుకొనునట్లు నేను చేయవలసిన మార్పులను నాకు చూపించండి. ఇతరులకు నేను ఆశీర్వదముగా ఉండునట్లు మరియు మీరు నా కొరకు కలిగియున్న గమ్యమును నెరవేర్చుటకు నన్ను సిద్ధపరచు చున్నందుకు వందనములు.