
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. —యాకోబు 1:3
పరిపక్వత కలిగిన విశ్వాసము ఒక్క రాత్రిలోగా కలుగదు. మీరు దేవునిలో లోతైన, ఆరోగ్యకరమైన, బలమైన విశ్వాసమును కలిగి యుండవలెనని ఆశించినట్లైతే, మనము దానిని బలపరచుటకు అభ్యాసం చేయవలసి ఉంటుంది.
సైన్యములోని సైనికులను చూడండి. వారు సేవచేసే ఒక విభాగంలో చేరిన వెంటనే వారు చాలా తీవ్రమైన యుద్ధాలకు సిద్ధంగా ఉండరు. వారు ప్రాధమిక శిక్షణను కలిగి యుండాలి. వారు కఠినమైన అభ్యాసం, వ్యాయామం మరియు తర్ఫీదు చేయబడతారు. సైనికులు బలం, దృఢత్వం, స్థితిస్థాపకత మరియు ఓర్పు కలిగి ఉండాలి కాబట్టి వీరిని “సన్నద్ధం” చేయడానికి డ్రిల్ బోధకులను నియమిస్తారు.
మనము ఈ విశ్వాసమును గురించిన మాటలను ఆలోచిద్దాము. మొదటిగా, మనము క్రీస్తును చేర్చుకుంటాము లేదా ఆయనకు మన జీవితాలను సమర్పించుకుంటాము. అప్పుడు మనము ప్రాథమిక శిక్షణ లేదా విశ్వాసం పెంపొందించే నియమావళిని ప్రారంభిస్తాము. ఈ సందర్భంలో, పరిశుద్ధాత్మ మనకు తర్ఫీదు బోధకుడిగా పనిచేస్తాడు.
విశ్వాసం పెంపొందించుటకు మనందరికీ ఏది అవసరమో పరిశుద్ధాత్మకు తెలుసు, తద్వారా మనం సమయా సమయముల యందు సిద్ధంగా ఉండగలము. మన విశ్వాసాన్ని ఎలా నిర్మించాలో ఆయనకు తెలుసు అని నమ్ముతూ, సవాలు చేస్తున్నప్పుడు కూడా మనం ఆయనకు విధేయత చూపాలి.
మీకు తర్ఫీదునిచ్చుటకు పరిశుద్ధాత్మను అనుమతించినప్పుడు, ఫలితములు – దేవునిలో బలమైన, దృఢమైన విశ్వాసము – అది తీసుకునే సమయము మరియు కృషి విలువైయున్నవి!
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, మీ హెచ్చరికలకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. నేను మీలో పరిపక్వత కలిగిన బలమైన విశ్వాసమును కలిగి యుండవలెనని ఆశించుచున్నాను. నేను వెలి చూపు వలన కాక విశ్వాసముతో నడచునట్లు, నా ప్రతి అవసరములో మరియు నా ప్రతి పరిస్థితిలో దేవుని యందు నమ్మికయుంచునట్లు నాకు నేర్పుము.