మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి… —2 కొరింథీ 10:5
మనము మన మనస్సులను నూతన పరచుట ప్రారంభించినప్పుడు మనము గందరగోళములో ఉండే సమయాలు కూడా ఉంటాయి. మనము పరిపూర్ణులము కాదని దేవునికి తెలుసు మరియు మనలను మన మార్గములోనికి తిరిగి నడిపించుటకు ఎల్లప్పుడూ సహాయం చేయును.
దురదృష్టవశాత్తు, మనము పరిపూర్ణులముకామని సాతానుడికి కూడా తెలుసు మరియు మన మార్గములోని ప్రతి మెట్టును గుర్తు చేయుటకు ఆయన తన ఉత్తమమైన దానిని చేయును.
మన మనస్సులో దాడి జరిగినప్పుడు మనము కలిసి వెళ్తూ, దేవుని సేవిస్తూ, మంచి చేయుచు, విశ్వాసముతో బయటికి వెళ్ళుచుండగా హఠాత్తుగా, ఏ విధమైన స్పష్టమైన సమర్థన లేకుండానే, మన రోజు లేదా వారమును కలిగి యుంటాము. సాతానుడు మనతో మన విఫలములను గురించి అనగా మనము మంచి వారము కాదని, అందుకే దేవుడు మనల్ని ప్రేమించడని … మొదలగు విషయాలు చెప్పడం మొదలు పెడతాడు.
కృతజ్ఞతా పూర్వకముగా దేవుని వాక్యము ఇటువంటి పరిస్థితులలో ఏమి చేయాలో మనకు తెలియజేస్తుంది. 2 కొరింథీయులకు 10:5 మనకు
తెలియజేయునదేమనగా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టుదుమని చెప్తుంది. కాబట్టి అపవాది మీతో అబధము చెప్పుటకు ప్రయత్నించినప్పుడు వాక్యములోనికి వెళ్లి ఆ అబద్ధమును వ్యతిరేకించే సత్యమును కనుగొనండి.
ఆ సందేహములు మీ మార్గములో వచ్చినప్పుడు, నిరుత్సాహపడవద్దు. వాటిని దేవుని వాక్యపు సత్యములోనికి తీసుకొనిరండి. ప్రతిసారీ అది పని చేస్తుంది!
ప్రార్ధనా స్టార్టర్
దేవా, నా మార్గమునుండి నన్ను తప్పించుటకు వచ్చే అబద్ధములు మరియు సందేహములను నేను అనుమతించను. దానికి బదులుగా, మీ వాక్యము ఏమి చెప్తుందో నేను దానిని నమ్ముతాను మరియు ఆ ఆలోచనలను చెరపడతాను!