ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. —3 యోహాను 1:2
మీ సంపూర్ణ జీవితం అనగా – ఆత్మ, ప్రాణం, శరీరం – దేవునికి చాలా విలువైనది మరియు ఆయన ప్రణాళికలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి భాగాన్ని నిర్వహించే బాధ్యతను ఆయన మీకు అప్పగించారు. కానీ మన జీవితంలో మనం చేసినది చాల అనిన సందర్భాలు ఉన్నాయి, మరియు దేవుడు మాత్రమే చేయగలడు అని మనం విశ్వసించాలి.
1980ల చివరలో నేను రొమ్ము క్యాన్సర్‌తో పోరాడినప్పుడు నేనేమైతే చేసియున్నానో ఒకవేళ మీకు కూడా ఆ శారీరక స్వస్థత అవసరం కావచ్చు. లేదా చిన్నతనంలో నేను అనుభవించిన లైంగిక దుర్వినియోగ అనుభవము నుండి పొందుకొనిన మానసిక లేక ఉద్రేకపరమైన స్వస్థత మీకు కూడా అవసరమై యుండవచ్చు. అది ఏదైనా, మీరు మరియు నేను మన యొక్క ఉనికిలోని ప్రతి భాగంలో ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారని దేవుని వాక్యం మనకు భరోసా ఇస్తుంది.
మీరు మరియు నేను ఏ విధంగానైనా అనారోగ్యంతో లేదా రోగముతో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని చేయమని పిలిచిన పిలుపుకు తగిన పనులు చేయకుండా మరియు ఆయన మనకు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదించకుండా చేస్తుంది. దేవుడు మీ కోసం గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడు, మరియు ఆరోగ్యవంతమైన శరీరం, ప్రాణము మరియు ఆత్మ-అనునది ఆయన మీకిచ్చిన పిలుపుకు తగిన పనులను చేయడానికి సిద్ధంగా ఉండటంలో ముఖ్యమైన భాగం. ఆయన స్వస్థపరచే శక్తి కోసం ఈరోజే ప్రార్థించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నాలోని ప్రతి భాగమును గురించి మీరు శ్రద్ధ కలిగి యున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. నా జీవితములో ఏ పరిస్థితియైనా గాయపడినప్పుడు నేను మీ అద్భుతమైన స్వస్తతా శక్తిని పొందుకుంటాను.