నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. —సామెతలు 3:9-10
చాలామంది ప్రజలు దేవుని నుండి పొందాలని కోరుకుంటారు, కానీ వారు తమకు తామే స్వయంగా ఇచ్చేందుకు ఇష్టపడరు. సత్యమేదనగా, మనము మన జీవితాలను మరియు మన హృదయాల పరిస్థితిని అంచనా వేయడం మనందరికీ మంచిది ఎందుకనగా ఇవన్నీ మనము దేవునిపై దృష్టి కేంద్రీకరించడానికి సహాయం చేస్తాయి, మన హృదయాలలో చేయాలని ఆయన అన్నిటినీ ఇవ్వడం మరియు చేయాలనే కోరిక. మనకు క్రొత్త నిబద్ధత ఇవ్వాలి మరియు మనల్ని, మన సమయాన్ని, మరియు ప్రభువు యొక్క పనిలో మన డబ్బును పెట్టుబడి పెట్టాలి.
సాతాను మీలో భయంకరమైన ఆలోచనలు ఇచ్చునట్లు అనుమతించకండి. యేసుకు మన అవసరాలు మరియు మన వాగ్ధానములు తెలుసు గనుక (మత్తయి 6:25-34) ఎవ్వరూ భయపడి లేదా చింతించకూడదని యేసు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు.
సామెతలు 3:9-10 చెబుతుంది, నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నీవు దేవునికి సమస్తమును అప్పగించినప్పుడు నీయెడల ఆయన శ్రద్ధ వహించటానికి విశ్వాసపాత్రుడుగా ఉంటాడు.
నిన్ను నీవే దేవునికి సమర్పించండి. నీవు కలిగియున్నదంతయు అనగా మీరు నిరీక్షించే సమస్తము, మీ కలలు దర్శనములన్నియు, ఆశలు మరియు కోరికలు ఆయనకు సమర్పించుము. అన్నింటినీ ఆయనకు చెందినవిగా చేయండి, మరియు ఆయన మీ జీవితం ద్వారా ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేడు నేను నీకు సమస్తమును నా చేతులు, నా నోరు, నా మనస్సు, నా శరీరం, నా డబ్బు మరియు నా సమయం ఇస్తాను. నేను కలిగియున్నది నీది. నేను ఈ రోజు మీ చిత్తాన్ని చేయాలనుకుంటున్నాను.