
కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. —యోహాను 8:36
మనము ఇక ఏమాత్రమును బంధకములలో ఉండాలని మనల్ని సృష్టించలేదు కనుక, మనము స్వతత్ర్యంలో – అనగా క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తములో ఆనందించుట మనము అనుభవించగలము. ఆయన మనకు జీవితమును ఇచ్చాడు మరియు మన లక్ష్యమేదనగా మనము దానిలో ఆనందించుటఏ.
మన జీవితములలో మనము కేవలం స్వేచ్చగా ఉండలేము. మనము చర్య తీసుకోవాలి. మనము దేవుని వాక్యాన్ని పాటించడం మరియు పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని అనుసరించడం అవసరం. దీని అర్థం కేవలం ఫలితాలను పొందడానికి మనము దేవుని వాక్యమును వినడం చదవటం కాకుండా – అది చెప్పేది కూడా మనం చేయాలి.
మీ జీవితాల్లో స్వేచ్చను అనుభవిస్తున్నారా? యేసులో మీకున్న స్వేచ్ఛను వెతకడానికి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. పాపపు శక్తి నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిలువపై మరణించినందున, మీరు మరియు నేను జీవితంలో ప్రతి సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
స్వేచ్చ మీ స్వంతమై యున్నది, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి దానిని అందుకోండి. పరిశుద్ధాత్మను అనుసరించుచు క్రీస్తు యేసులో దేవుడు మీ కొరకు దాచి యుంచిన సమస్తములో ఆనందించుటకు స్వాతంత్ర్యమును కలిగి యుండండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను పాపములో, బంధకములో మరియు అణచివేత నుండి నేను నీలో స్వేచ్చను పొంది యున్నాను. నా జీవితంలో పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం ద్వారా నా స్వేచ్ఛ కోసం చర్య తీసుకోవడానికి నేను ఎంచుకుంటాను.