
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. —కీర్తనలు 119:105
మనము ఎదుగుటకు మరియు దేవునితో సంబంధములో అభివృద్ధి పొందుటకు అవకాశము కలదనే విషయము సత్యమై యున్నది. నేను ఇంకా ఎంత దూరము వెళ్ళాలి అని ప్రతిరోజూ ప్రతి క్షణము నిరుత్సాహపడుతూ ఉంటాను. నేను విఫలతను ఎల్లప్పుడూ ఎదుర్కొంటున్నాను – నేను ఎలా ఉండాలో అలా ఉండుటలేదనే భావన, నేను చాలినంతగా పని చేయుట లేదు మరియు నేను ఇంకనూ పని చేయవలసియున్నదని భావనను కలిగియుంటున్నాను. అయినప్పటికీ నేను ఎక్కువగా ప్రయత్నించినప్పుడు, నేను మరలా విఫలమయ్యాను.
ఇప్పుడు నేను ఒక నూతన వైఖరిని అలవరచుకున్నాను: నేను ఎక్కడ ఉండాలో అక్కడ లేను కానీ నేనెప్పుడు ఎక్కడ ఉండేదాననో ఇప్పుడు అక్కడ లేను కాబట్టి దేవునికి వందనములు. నేను బాగానే ఉన్నాను, నా మార్గములోనే ఉన్నాను! ఇప్పుడు నేను నా హృదయపూర్వకముగా దేవుడు నాతో కోపముగా లేడని నేను ఎరిగి యున్నాను ఎందుకనగా నేను ఇంకనూ అక్కడికి చేరుకోలేదు. దేవుడు నా కొరకు ఏర్పరచిన మార్గములోనే నేను ప్రారంభించి యున్నాను కాబట్టి నేను సంతోషముగా ఉన్నాను.
మీరు మరియు నేను ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడు మన అభివృద్ధితో సంతోషిస్తాడు. ఆయన మన ఎదుట తన మార్గమును వెలిగించునని వాగ్ధానం చేసి యున్నాడు. మనకు మార్గము తెలియకపోవచ్చు, మరియు మనము సమయాసమయములందు భయపడుతు ఉండవచ్చు కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీ అభివృద్ధిని చూచును మరియు మీరు సరియైన మార్గములో వెళ్ళుటకు సహాయం చేయును!
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ఎక్కడ ఉన్నాననే విషయమును బట్టి నేను నిరుత్సాహపడుట లేదు. మీరు నన్ను ఇప్పటికే చాలా దూరము నడిపించి యున్నారు మరియు మీరు నా మార్గమును వెలిగిస్తారని నేను ఎరిగి యున్నాను.