
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. —యోహాను 17:4
అనేక సంవత్సరాల క్రితం ఒక వచనం నేను ప్రభువు ముందు కన్నీరు కార్చుటకు కారణమైంది. యోహాను 17:4లో, యేసు చెప్పెను, నీవు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి భూమి మీద మహిమ తీసుకువచ్చాను. దేవునిని అనుసరించడం అంటే, ఆయన మనల్ని ఏ పని నిమిత్తమైతే పిలిచాడో ఆ పనిని పూర్తిచేయుట.
ఆ వచనాన్ని చదివినప్పటినుంచి, దేవుడు నన్ను ఏమి చేయమని పిలిచాడో దానిని చేయుట నాకు చాలా ప్రాముఖ్యమైనది, కానీ ఆయన నన్ను దేనికి పిలిచాడో దానిని ముగించి యున్నాను.
చాలా మంది వ్యక్తులు బయటికి వెళ్లి, దేవునితో ఒక ప్రయాణాన్ని ప్రారంభించేవారు, కాని దానిని దాదాపుగా ఎక్కువమంది పూర్తి చేసినట్లు నేను భావించడం లేదు.
అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పెను, …. నా పరుగును, …….. తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును … (అపోస్తలుల కార్యములు 20:24).
నేను దేవుని పిలుపుని పూర్తి చేయాలని తీర్మానం చేసుకొని, ప్రతి నిమిషం దాని యందు ఆనందిస్తాను! ఇది మీ కోసం నేను చేయాలని కోరుకున్నాను – మీ జీవితంలోని ప్రతిరోజూ ఆస్వాదిస్తు మరియు దేవుడు మిమ్మల్ని పిలిచిన దాన్ని పూర్తి చేయండి.
కానీ ఇదంతయు మన ఆసక్తి మీద ఆధారపడి యుంటుంది. కానీ ఇది దేవుని ఆసక్తికి సంబంధించినది కాదు. ఆయన క్రీస్తులో మనకు అవసరమైన ప్రతిదానిని చేసాడు. ఇది నేర్చుకోవడము, ఎదగడము, మరియు దేవుని ఆత్మ మనలో పనిచేయుట కలుగజేయుటకు అనుమతించుట అంతయు మన యిష్టం. దేవుడు మిమ్మల్ని పిలిచిన సమయాన్ని పరిగణనలోనికి తీసుకోండి మరియు దేవుడు నా యెదుట ఉంచిన దానిని బలంగా పూర్తి చేయుటకు నేడు నేను ఏమి చేస్తున్నాను? అని నిన్ను నీవే ప్రశ్నించుకో.
దేవుడు నీ కోసం గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. విశ్వాసము ద్వారా వాటిని స్వీకరించండి మరియు మీ హృదయముతో వాటిని అనుసరించుము. నేడు, నేను బలంగా పూర్తి చేయడానికి మీరు నిబద్ధత చేయాలని కోరుకుంటున్నాను. ఇది దేవుని ఘనపరచే సమర్పణ అని నాకు తెలుసు.
ప్రారంభ ప్రార్థన
దేవా, యేసు చేసినట్లుగా మీరు నాకిచ్చిన పనిని పూర్తి చేశానని నేను చెప్పగలను. నా ఉద్దేశ్యం కోసం జీవించాలనే కోరిక మరియు ఆనందంతో నా పనిని పూర్తిచేయటానికి నేను శక్తిని పొందుకోనునట్లు నాలో పని చేయుచున్నందుకు ధన్యవాదాలు.