ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? —ప్రసంగి 4:12
నిజంగా గొప్ప వివాహం కంటే గొప్పది ఏదీ లేదు మరియు చెడ్డదాని కంటే ఘోరమైనది ఏమీ లేదు. క్రైస్తవ వివాహాలు అంటే ఇద్దరు వ్యక్తులు దేవుని చిత్తాన్ని సాధించడంలో – వారి ఆనందం కోసం మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి బలమైన శక్తిగా మారగలరని నిరూపించుటయే.
ఏదిఎమైనప్పటికీ, ఇద్దరు వ్యక్తులను ఒక బలమైన వివాహంలో కలపడం అనేది ఒక ప్రక్రియ, అది స్వయంగా జరగదు. మీరు వివాహం చేసుకున్నప్పుడు మీరు ఎంత గాఢమైన ప్రేమలో ఉన్నా కేవలం మంచి వివాహం దానంతట అదే జరగదు. మీరు ఈ ప్రక్రియలో దేవునిని ఆహ్వానించాలి.
మనము యేసును ఎరిగి యున్నప్పుడు మరియు మన వివాహములో ఆయనను ఆహ్వానించినప్పుడు, మన సంబంధము మూడు పేటల త్రాడు వలె ఉంటుంది. క్రీస్తు మనతో ఉన్నప్పుడు ఒక స్త్రీ మరియు పురుషుల కలయిక ఒక గొప్ప బలముగా మారుతుంది.
మనము ఆశించిన విధముగా పని చేసే జీవిత భాగస్వామి దొరికినప్పుడు వివాహములో సంతోశము కలుగదు. అది ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు పరిపూర్ణుడైన దేవుని యందు నమ్మిక యుంచి వారి కొరకు ఆయన కలిగి యున్న చిత్తమునకు అనుగుణముగా జీవించుట. అటువంటి వివాహమును దేవుడు ఆశీర్వదిస్తాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నా జీవిత భాగస్వామిని ప్రేమించుచున్నాను, కానీ రెండు పేటల త్రాడు సరిపోదు. నేను నా వివాహములో మిమ్మును ఆహ్వానించాలని ఆశిస్తున్నాను తద్వారా మీరు మా ఇద్దరి ప్రేమను బలపరచి మీరు మా కొరకు ఏర్పరచిన ప్రణాళికలోనికి మమ్మును నడిపించుటకు మిమ్మును ఆహ్వానిస్తున్నాను.