మెల్లని చిన్న స్వరమునకు చెవి యొగ్గుము

మెల్లని చిన్న స్వరమునకు చెవి యొగ్గుము

ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను.  —1 రాజులు 19:12

మన జీవితములలో సమాధానమును కనుగొనుటకు, దేవుడు మనకు ప్రతిరోజు అనుగ్రహించే ఆయన మాటలకు విధేయత చూపుటయే. ప్రామ్టింగ్ అనగా ఏదైనా ఒక పనిని చేయమని మన హృదయములో చొచ్చుకొని పోయేటట్లు చెప్పుట మరియు ఏమి చేయాలో తెలియజేయుట. 1 రాజులు 19:12 నిమ్మళముగా మాట్లాడు స్వరమును గురించి మనకు తెలియజేస్తుంది. నిమ్మళముగా మాట్లాడుట అనునది తలమీద సుత్తితో కొట్టినట్లు మాటలాడుట కాదు!

1 రాజులు గ్రంధములో, దేవుడు గొప్ప మరియు బలమైన గాలిని, ఒక భూకంపమును లేక అగ్నిని ఉపయోగించలేదు. ఆయన స్వరము ఏలియా వద్దకు మెల్లని నిమ్మలమైన స్వరముగా వచ్చి యున్నది. నిమ్మళమైన స్వరములో అసలు స్వరమే ఉండదు. వాస్తవముగా, దేవుడు కొన్నిసార్లు మీ చెవులకు కాకుండా మీ హృదయాలతో మాట్లాడతాడు.

ఒకవేళ మనము కేవలం దేవుడు చెప్పినది వినుట మాత్రమే కాక, దానిని చేయడం నేర్చుకుంటే మనకు మేలు జరిగే విషయాలను మనము కనుగొంటాము.  పరిస్థితి ఎలా ఉన్నా మనము దేవుడు చెప్పిన దానిని విని ఆయన స్వరమునకు చెవియోగ్గుతాము. దేవుడు మిమ్మల్ని కొన్ని పనులను చేయమని చెప్పినప్పుడు మీకు కారణములు అర్ధం కాక పోవచ్చు, కానీ మీరు ఆయన స్వరమును వినుచుండగా మరియు ఆయన ప్రత్యక్షతకు విధేయత చూపుచుండగా మీరు ఆయన శాంతిలో విశ్రాంతి తీసుకోగలరు.కాబట్టి వినండి!


ప్రారంభ ప్రార్థన

పరిశుద్దాత్మా, ప్రతిరోజూ మీ మాటలను నేను సన్నిహితముగా వినుటకు నాకు సహాయం చేయండి. నాకు మీ శాంతి అవసరమై యున్నది కాబట్టి నేను మీ మాటలకు చెవియొగ్గుదును.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon