మేలు చేయుటకు “శోధించబడుట”

మేలు చేయుటకు “శోధించబడుట”

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు (తాను దృఢముగా ఉన్నానని స్థిరమైన మనస్సు కలిగి యున్నానని తలంచువాడు) (పాపములో) పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. —1 కొరింథీ 10:12

మనము పాపములో పడుటకు మనల్ని నడిపించేది ఏదనగా మన గురించి మనము ఎక్కువగా అలోచించుచు మనల్ని మనమే ఎక్కువగా నమ్ముట. ఇది శత్రువు ద్వారా ప్రోత్సహించబడిన వైఖరి. మనకు గర్వముతో నిండుకొని మనము చాల బాగున్నాము అని అనుకుంటాము, కానీ అప్పుడు సాతానుడు మనల్ని శోధించి పాపములో పడునట్లు చేస్తాడు.

ఇప్పుడు, ఈ తరువాత ప్రకటన మిమ్మును ఆశ్చర్య పరుస్తుంది: ఇక్కడ ఒక మంచి రకమైన శోధన ఉన్నదని మీరు తెలుసుకోవలెను. మనము చెడు చేయునట్లు సాతానుడు మనలను శోధిస్తాడు, కానీ ఒక విధంగా చూస్తే దేవుడు మనము మేలు చేయునట్లు దేవుడు మనలను శోధిస్తాడు. సాతానుడు మీ ఎదుట చెడ్డ ఎంపికను ఉంచిన ప్రతిసారీ దేవుడు ఎల్లప్పుడూ ఒక మంచిదానిని సిద్ధంగా ఉంచుతాడు.

పాపము చేయుటకు వచ్చే శోధనతో నింపబడినప్పుడు, పరిశుద్దాత్మ దేవుడు శత్రువు కంటే గొప్ప బలమైన వాడని జ్ఞాపకముంచుకోండి మరియు ఆయన మంచి మార్గములో మిమ్మల్ని నింపగలడు. మీరు ఆయనను అనుమతించినట్లైతే మీరు గొప్ప కార్యములు చేయునట్లు మిమ్మల్ని ప్రభావితం చేస్తాడు.

దేవుడు మన జీవితములను కాపాడుటకు ప్రయత్నిస్తాడు. ఆయన ఏమి జరిగినా మనలను బలపరచాలని ఆశిస్తాడు మరియు మనము ఆయన కాపుదల క్రింద మనలను భద్రపరచి కాపాడును. మనము మేలు చేయుటకు దేవుడు మనలను శోధించినప్పుడు మీరు చేయదగిన ఉత్తమమైన పని ఆయనకు విదేయులగుట.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్దాత్మా, నేను మీ మంచి శోధనలను గురించి వినాలని మరియు వాటిని పాటించాలని ఆశిస్తున్నాను. శత్రువు నన్ను కదిలించాలని ప్రయత్నించినప్పుడు నేను అనుసరించుటకు మీ చిత్తమును మరియు మీ మార్గమును నాకు చూపించుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon