యుద్ధ భూమిని గుర్తించండి

యుద్ధ భూమిని గుర్తించండి

మా యుద్ధోపకరణములు (రక్త మంసములకు) శరీరసంబంధమైనవి కావుగాని…. —2 కొరింథీ 10:4

మీరు అనుదినము యుద్ధములో ఉన్నారని మీకు తెలుసా? చుట్టూ ఉన్న బాధల వైపు చూస్తూ, యుద్ధములు బహిరంగముగా జరుగుతున్నాయని అనుకుంటాము, కానీ వాస్తవముగా, అవి అంతర్గతముగా జరుగుతున్నాయి – మన మనస్సుయనే యుద్ధ భూమీ మీద జరుగుతున్నాయి.

మనము మన యుద్ధరంగాన్ని గుర్తించుటలో విఫలమైనట్లైతే, మనము మన శత్రువును సరిగా గుర్తించుటలో విఫలమవుతాము. మనము ప్రజలను, ధనమును, మతమును లేక “పద్ధతిని” నమ్ముట మనకు సమస్యలుగా ఉన్నాయి. మన మనస్సును మనము నూతన పరచుకొనని యెడల మనము ఆ అబద్ధములను నమ్ముతూ మన మోసమును ఆధారముగా చేసుకొని ప్రాముఖ్యమైన నిర్ణయములను తీసుకొనుటలో ఇబ్బందిలో పడతాము.

ప్రతో రోజు మన మనస్సులో ఆలోచనలు, ఊహలు, సందేహములు మరియు భయములతో స్థిరముగా వ్రేలాడుతూ ఉంటాము. ఇందులో ఏదైనా మన ఓటమి మరియు నాశనమునకు కారణమైతే దేవుని సత్యంను పట్టుకొనుట ద్వారా విజయము మరియు ఆనందమును మనకు కలిగించును.

మీరు మీ జీవితములోని కొన్ని ప్రధాన దుర్గములను పడగొట్ట వలసి వుంది. దేవుడు మీ పక్షమున ఉన్నాడని మిమ్మును ప్రోత్సహించనివ్వండి. ఒక యుద్ధము జరుగుతున్నది మరియు మన మనస్సు ఆ యుద్ధ భూమి. కానీ ఒక శుభవార్త ఎదనగా దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయుచున్నాడు!


ప్రారంభ ప్రార్థన

పరిశుద్దాత్మా, నేను నా మనస్సులో జరుగుతున్న నిజమైన యుద్దమును నిర్లక్ష్యము చేస్తూ మోసగించబడవలేనని ఆశించుట లేదు. నేను మంచి పోరాటము పోరాడునట్లు నన్ను కాయుము. నీవు నా పక్షమున నుండగా నేను ఓడిపోను!

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon