యేసు ఒక పరిసయ్యుడు కాదు

యేసు ఒక పరిసయ్యుడు కాదు

ఆయనయందు (ఆధారపడువారికి, ఆనుకొను వారికీ, నమ్మిక యుంచు వారికీ) విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను… —యోహాను 3:18

తృణీకరణ ద్వారా ఏర్పడిన గత గాయముల నుండి తన ప్రజలు స్వస్థపరచబడవలేనని దేవుడు ఆశించుచున్నాడు. ఆయన ఎప్పుడూ నిన్ను తృణీకరించనని మీరు తెలుసుకొనవలెనని ఆయన కోరుతున్నాను. ఆయన మత్తయి 11:28 లో ఇలా చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇది పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, విఫలమైనప్పుడు తమను తాము అపరాధ భావనలతో బాధ పడేవారిని సూచిస్తుంది.

యోహాను 3:18 లో పరిసయ్యుల ధర్మ శాస్త్రము క్రింద జీవించుటకు ప్రయత్నించే వారితో యేసు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులను సంతోషపరచుటకు ఎంతో సమయం పడుతుంది – మరియు ఈరోజు వారు మన చుట్టూ ఉన్నారు. మీకు ఒక సందేశం మీకు తెలుసని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను – మీకు సందేశం ఇచ్చే వ్యక్తి మీతో, “మీరు పూర్తిగా సంపూర్ణ ప్రదర్శన ఇచ్చి నన్ను సంతోషపెడితే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఒకవేళ మీరు అలా చేయకపోతే నేను నా ప్రేమను వెనక్కి తీసుకొని మిమ్మల్ని త్రుణీకరిస్తాను” అని చెప్పవచ్చును.

యేసు పరిసయ్యుడు కాదు. ఆయన యోహాను 3:18 లో ఆయన యందు విశ్వాసముంచిన వారికి ఆయన తృణీకరించడు. ఆయన యందు విశ్వసముంచండి, ప్రేమించండి, ఆనుకోండి, మరియు ఆయన యందు నమ్మిక యుంచి ఆధారపడండి. అప్పుడు ఆయన మీ కొరకు ఏర్పరచిన సమృద్ధియైన జీవితములోనికి నిజముగా మీరు ప్రవేశించగలరు.


ప్రారంభ ప్రార్థన

దేవా, నన్ను ప్రేమించినందుకు మరియు అంగీకరించినందుకు వందనములు. నేను నీయందు విశ్వాసముంచు చున్నాను, ప్రేమించుచున్నాను, నమ్మిక యుంచుచున్నాను మరియు నాలో ఉన్న సమస్తముతో నేను నీ మీద ఆధార పడుతున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon