
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. -ఫిలిప్పీయులు 2:9-11
క్రైస్తవులతో సహా చాలామంది ప్రజలకు యేసు నామంలో ఉన్న అత్యంత గొప్ప శక్తిని గురించి ఏమాత్రము తెలియదు.
మీరు ఎప్పుడైనా ఒక పేరు యొక్క ప్రాముఖ్యత గురించి ఆలోచించారా? ఒక వ్యక్తి యొక్క పేరు అతడి పాత్రను ప్రతిబింబిస్తుంది మరియు ప్రతి ఒక్కరి నుండి అతనిని వేరుచేస్తుంది. మనము ఎవరినైనా వారి పేరుతో పిలిచినప్పుడు, మనము ఆ వ్యక్తి గురించి ఏదో ఒక ప్రకటన చేస్తున్నాము.
అదే విధంగా, మనము యేసు పేరు చెప్పినప్పుడు, మనము కేవలం ఒక పేరు గురించి మాట్లాడటం లేదు. మనం మానవ శక్తి కాని – శక్తిని అనగా దేవుని సమస్త శక్తి మరియు అధికారమును ప్రకటిస్తున్నాము (కొలస్సీయులకు 2: 9-10 చూడండి).
మనము ఆ పేరు మాట్లాడినప్పుడు, మనము ఆ వ్యక్తిని గురించి వివరిస్తున్నాం. యేసు అంటే “రక్షకుడు” అని మరియు మన కోసం ఆయన చేసిన దాని ప్రకారం -మన పాపము నుండి, మన వైఫల్యాల నుండి మరియు ఆయన చిత్తములో లేని పరిస్థితుల నుండి మనలను కాపాడుతాడని మనము ప్రకటిస్తున్నాము (మత్తయి 1:21 చూడండి).
అనేకమంది ప్రజలు ఆధ్యాత్మిక శక్తిని అనుభవించాలని కోరుకుంటారు, కానీ దానిని విడుదల చేయడానికి వారు విశ్వాసంతో యేసు నామమును ఉచ్చరించాలి. నమ్మిన వారికి ఆ అద్భుతమైన పేరు ఇవ్వబడింది. దేవుని కుమారుడిగా, ఈరోజు విశ్వాసంలో ఆయన నామమును ఉచ్చరించండి.
ప్రారంభ ప్రార్థన
తండ్రియైనా దేవా, నా జీవితంలో ప్రతి పరిస్థితి మీద, నేను విశ్వాసంలో యేసు యొక్క నామమును ప్రకటిస్తున్నాను. నీ కుమారుని రక్షించు శక్తిని బట్టి ధన్యవాదాలు.