
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. – యాకోబు 4:8
పైన ఉన్న వచనాన్ని గురించి మీరు ఒకటి గమనించదలిచాను. పాపము చేయడం ఆపమని చెప్పేముందు దేవుని దగ్గరికి రావాలని మనకు చెప్పబడినట్లు గమనించండి.
చాలా మంది ప్రజలు ఈ విషయంలో వెనకబడిఉన్నారు. వారు దేవుని వద్దకు ఎన్నటికీ రాలేరని, ఆయనతో ఎన్నడూ సంబంధం కలిగి ఉండరని, మరియు వారు తమ జీవితంలో సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నందున ఎప్పుడూ క్రైస్తవుడిగా ఉండరని అనుకుంటున్నారు. వారు తమను తాము ఎవరితోనైనా కలిసి సరి చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నారు, కాబట్టి వారు ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండటం మంచిది.
కానీ అది తప్పు. యేసు ఈలోకమునకు వచ్చుటకు కారణమేదనగా అయన లేకుండా మనము ఎన్నటికీ ఎప్పటికీ మంచిగా ఉండలేము. మన జీవితాల్లో యేసును కలిగి ఉండాలి. ఆయన మరణం, మన పాపాల కొరకు అయన చెల్లించిన రక్తము – మనము చెల్లించాల్సిన ఋణమును తీర్చియున్నది.
యేసు నామము ద్వారా దేవునికి మనము సన్నిహితముగా వచ్చేంత వరకు మనము పాపము నుండి పరిశుద్ధపరచబడము. నేడు మీరు ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. నీవు మొదట పాపాన్ని నీవు శుభ్రపరచుకోవాల్సిన అబద్ధాన్ని నమ్మి, దూరంగా ఉండకు. బదులుగా, దేవుని వద్దకు వెళ్ళి, మీ కోసం యేసు చేసిన బలి ద్వారా ఆయన మిమ్మల్ని శుద్ధిచేయునట్లు అనుమతించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా పాపమును శుద్ధిచేసిన యేసు రక్తము ద్వారా నేను మీ వద్దకు వచ్చియున్నాను. మీరు క్షమించినందుకు ధన్యవాదాలు. అవమానములో జీవించుటను నేను నిరాకరించాను ఎందుకంటే ఇప్పుడు నేను నీకు దగ్గరకు రాగలనని, నీ ప్రేమను, క్షమాపణను స్వీకరించానని నాకు తెలుసు.