యేసు వలె అదే దయలో నడువుము

యేసు వలె అదే దయలో నడువుము

యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.  – లూకా 2:52

బాల్యం నుండి యేసు దేవుడు మరియు మనుష్యుల అసాధారణ దయలో నడిచి యున్నాడు. వాస్తవముగా ఆయన చాలా ప్రసిద్ధి చెందినవాడు కాబట్టి ఆయన ఒంటరిగా ప్రార్ధించుటకు మరియు తండ్రియైన దేవునితో సహవాసము కలిగి యుండుటకు సమయం కలిగియుండుట చాల కష్టం. అయినప్పటికీ ఆయనను క్రీస్తుగా ఆయన యందు విశ్వాసముంచని వారు కూడా దేవుని దయలో ఆయన నడచి యున్నాడని గుర్తించారు.

యేసును పట్టుకొనుటకు పరిసయ్యులు పంపిన ఆ బంట్రౌతులు ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదనిరి! (యోహాను 7:46). ఆయన సిలువ మీద ఉన్నప్పుడు అతని జీవితాంతము వరకు దేవుడు ఆయనతో ఉండేనని ప్రజలు గ్రహించి యున్నారు (లూకా  23:47-48).

అదే దయ మనకు కుడా అందుబాటులో ఉన్నది. ఏది జరిగినా మనకు దేవుని మరియు మనుష్యుల దయను కలిగి యున్నామని మనము మరచి పోకూడదు (లూకా 2:52 చూడండి). మన జీవితములో అనేక మంచి విషయాలవలెనే వాటిని పొందుకొనుటకు మనము దేవుని మీద విశ్వాసముంచవలెను.

కాబట్టి ఈరోజు విశ్వాసములో జీవించుము, యేసు కలిగియున్న అసాధారణ దయను దేవుడు మీకు కూడా అనుగ్రహించునని ఆత్మ విశ్వాసమును కలిగి యుండండి. మీ జీవితములో సంభవించే పరిస్థితులను బట్టి కాక అసాధారణ దయ కొరకు దేవుని యందు విశ్వాసముంచండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, యేసు నడచిన దయ నాకు కూడా అందుబాటులో ఉందని నాకు తెలుసు. మీతో మరియు ప్రజలతో ఈరోజు దయను కలిగియుండే విశ్వాసములో నడచుటకు నాకు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon