యేసు వలె క్షమించుట నేర్చుకోండి

యేసు వలె క్షమించుట నేర్చుకోండి

యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. —లూకా 23:34

ఒక యవ్వనస్థుడు త్రాగి యాక్సిడెంట్ చేయడం వలన ఒకని భార్య మరియు వారి బిడ్డ మరణించిన ఒక సంఘటనను గురించి నేను విన్నాను. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించాలని ఆ వ్యక్తికి తెలుసు మరియు చాలా ప్రార్ధించిన తరువాత ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ప్రవహించడం ప్రారంభించింది.

యేసు వలె ఎలా క్షమించాలో ఆ వ్యక్తికి తెలుసు. ఈ యవ్వనస్థుడు కూడా చాల హృదయ వేదనను కలిగి యున్నాడని మరియు అతనికి కూడా స్వస్థత అవసరమని గుర్తించాడు.

ప్రజలు మనలను గాయపరచినప్పుడు, ప్రజలు మనకేమి చేసియున్నారనే విషయాన్ని కాక వారికేమి చేసియున్నారనే విషయాన్ని చూచుట నేర్చుకొనవలెను, ఎందుకనగా గాయపరచే ప్రజలు గాయపడతారు. సాధారణముగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గాయపరచినప్పుడు అతడు బహుశా అతడు తనను తను గాయపరచుకుంటాడు మరియు ఫలితంగా బాధపడతాడు. అందుకే, ఆయన బాధలో సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు, యేసు తనను చంపబోతున్న వారితో, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి.”

అది చెప్పనాశక్యమైన క్షమాపణ. అది నిన్ను ఈరోజు ఉత్తేజపరుస్తుంది. మనము కుడా యేసు వలె క్షమించుటను వెదకవలసి యున్నది.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, ప్రజలు నన్ను గాయపరచినప్పుడు, నా గత నొప్పిని చూచుటకు మరియు వారి బాధను కూడా చూచుటకు సహాయపడుము. యేసు వలె ప్రేమించుటకు మరియు క్షమించుటకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon