… మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. —హెబ్రీ 12:2
సాధారణముగా ప్రతి దానికీ రెండు వైపులు ఉంటాయి. సిలువకు రెండు వైపులు ఉంటాయి: సిలువ వేయబడుట మరియు పునరుద్ధానము చెందుట. యేసు ఒక దానిని సహించినట్లైతే రెండవ దానిని పొందుకుంటాడు. ఒకవేళ ఆయన దానిని సహించకపోతే మనమందరము ఇప్పటికీ రక్షకుడు లేకుండా ఉండే వారము మరియు పాప క్షమాపణ లేకుండా ఉండే వారము.
హెబ్రీ 12:2 చెప్తున్నదేమనగా సిలువలోని మరియొక వైపు అనగా – పునరుత్థానము – బాధను సహించుట అనునది బహుమానమును పొందుకొనుటలోని ఆనందమైయున్నది. సహించుటలోని నా నిర్వచనమేదనగా “సాతానుని ఓడించుటకు; మన జీవితములో చేయబోయేది ఏమిటనేది విచారణ చేయటానికి మరియు సిలువ యొక్క ఒక వైపు నుండి మరియొక వైపునకు శోధనను అనుమతించుచు సహనముతో సహించుటయే.”
మనము శోధనను ఎదిరించుటకు మనము ఏదైనా పొరపాటు చేయుట ద్వారా మనము ఉహించని పరిస్థితిని లేక ఏదైనా బాధను ఎదుర్కొన్నప్పుడు మనము కొన్ని విషయల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కానీ కష్ట పరిస్థితులను మరియొక వైపునుండి ఎదుర్కొనుట ద్వారా మంచి ఫలితమును – అనగా బహుమానమును పొందుటలో ఆనందమును కలిగి యుంటాము.
ఈరోజు, యేసు శోధనలను ఎదుర్కొనిన విధానముల ద్వారా మీరు ప్రోత్సహించబడండి. ఆయన ఎదుట అంతము వరకు మీ కొరకు దాచి యుంచబడిన ఆనందమును గురించి ఆయన ఎరిగి యున్నాడు. దానిని చేయుటకు ఆయన మీకు శక్తిని అనుగ్రహించి యున్నాడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను యేసు వలె సహించాలని ఆశిస్తున్నాను. నా కొరకై దాచియుంచబడిన ఆనందమును పొందుకునే దర్శనమును కలిగి యుండుటకు సహాయం చేయుము మరియు మీ కృప ద్వారా నా మార్గములో ఎదుర్కొనే ప్రతి శోధనను నేను సహించగలను.