
మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను. —లూకా 1:79
దేవుడు మనకు ఇచ్చిన అతి ముఖ్యమైన ప్రయోజనాలు మరియు గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి ‘శాంతి’ అని నేను నమ్ముతున్నాను. ఏదేమైనా, రోజువారీ జీవితంలో తీరిక లేకుండా మరియు తద్వారా వచ్చె ఒత్తిడిలో, మనకు తరచుగా ఏదైనా ప్రశాంతత ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అది ఆ విధంగా ఉండవలసిన అవసరం లేదు.
దేవుడు యేసుకు అప్పగించిన పనులలో ఒకటి మనలను శాంతి మార్గంలోకి నడిపించడమే అని లూకా 1:79 చెప్తుంది. విశ్వాసులుగా, మనం ఎంత తీరిక లేకుండా ఉన్నా లేదా మన చుట్టూ ఏమి జరుగుతుందో అనే దానితో సంబంధం లేకుండా, దేవుని అసాధారణ శాంతిలో నడవడానికి మనకు అద్భుతమైన ఆధిక్యత కలదు.
నేను నా జీవితంలో మొదటి నలభై సంవత్సరాలు శాంతి లేకుండా జీవించాను-నేను దయనీయంగా ఉన్నాను. చివరకు నేను శాంతి కోసం ఆరాటపడే స్థితికి వచ్చాను, అది కలిగి ఉండటానికి అవసరమైన ఏవైనా మార్పులు చేయటానికి నేను దేవునితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కృతజ్ఞతగా, నేను ఇప్పుడు శాంతిని అనుభవిస్తున్నాను, అది తరచుగా అవగాహనను కలిగిస్తుంది. జీవిత తుఫానులు లేనప్పుడు మాత్రమే కాదు కానీ తుఫానుల సమయంలో కూడా నేను శాంతి మార్గంలో నడుస్తున్నాను.
మీరు శాంతిని అనుసరించడానికి ప్రాధాన్యతనిచ్చారా? దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. క్రీస్తులో మీరు కలిగియున్న శాంతి కొరకు పరిశుద్ధాత్మను అనుసరించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా పాదమును మీ సమాధానములోనికి నడిపించుటకు మరియు మార్గదర్శకముగా ఉండునట్లు నా కొరకు యేసును పంపినందుకు వందనములు. నేను నా జీవితమునకు సమాధానమనే గొప్ప ఆశీర్వదమును నేను పొందుకొనుచున్నాను.