
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. —కీర్తనలు 42:5
ప్రజలు ఉద్రేకపరముగా స్థిరత్వము లేనప్పుడు వేదనను అనుభవిస్తారు మరియు ఎదో విధముగా వారు చింతను వ్యక్త పరుస్తారు. వారు నిగ్రహించుకోలేనంతగా రోదిస్తారు మరియు కన్నీళ్లు లేక నిస్పృహతో కూడిన ఇతర భావనలు ఎదురు చూడనంతగా వస్తు పోతూ ఉంటాయి. ఇటువంటి సమయాల్లో రాజైన దావీదు వైపు చూడటం జ్ఞానయుక్తమైనది.
కీర్తనలు 42:5 లో, దావీదు చింతా క్రాంతుడుగా ఉండుటను చూస్తాము మరియు అతడు దానిని ఎదిరిస్తాడు. అతడు అందులోనే మునిగిపోలేదు మరియు నిరాశతో క్రుంగి పోలేదు. అతడు ఎలా భావించాడో వివరించాడు, కానీ అతడు అతని భావనల ద్వారా జీవించకుండా ఉండునట్లు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతడు స్తుతించాడు మరియు దేవుని యందు నమ్మిక యుంచాడు.
మనలో అనేక మంది కష్ట సమయాల గుండా వెళ్తున్నప్పుడు వేదనతో కూడిన నష్టం కలుగుతుంది మరియు మనము రోదించుటకు మన కొరకు సమయాన్ని ఇవ్వవలసి యున్నది. మనము ఆ ప్రక్రియగుండా వెళ్తుండగా, దేవుడు మనలను ఆదరించాలని మరియు దాని గుండా వెళ్ళుటకు మనకు తన కృపను అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. దేవునిలో ఎవరైతే విశ్వాసములో నడుస్తారో, వారు అందులోనికి వెళ్ళుట కంటే బయటికి రావడమే ఉత్తమముగా భావిస్తారు.
మీ కుటుంబములో ఒకటి కోల్పోయినందున మీరు గాయపడియున్నట్లైతే మీ ఎదుట ఒక నూతన ప్రారంభము ఉన్నదని మీరు గ్రహించాలి. దావీదు చేసినట్లుగా నమ్మండి మరియు దేవుని స్తుతించండి. సాతానుడు మీకు హాని కలిగించుటకు ఏదైతే ఉద్దేశిస్తాడో, దేవుడు దానిని మీ చుట్టూ మేలుగా మార్చును!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను రోదిస్తూ నిరాశకు గురైనప్పుడు, నేను మిమ్మును స్తుతించుటకు మరియు మీ యందు నమ్మిక యుంచుటకు నేను ఎన్నుకొని యున్నాను. రోమా 8:28 చెప్పినట్లుగా, సమస్తము నా మేలు కొరకే నీవు మార్చగలవని నేను నమ్ముతున్నాను.