నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారుI —యోహాను 17:15-16
ఈ రోజు అనేక మంది ప్రజలు తాము పరిమితికి మించి, ఓవర్లోడ్ యొక్క శాశ్వత స్థితిలో జీవిస్తున్నారు. ఫలితముగా వారు పతనం అంచున ఉన్నారు – ప్రజలు అన్ని రకముల ఒత్తిడి, నిరుత్సాహము మరియు వ్యతిరేకతలో జీవిస్తున్నారు. కానీ శుభవార్త ఎదనగా క్రైస్తవులముగా మనము యోహాను సువార్త 17 ప్రకారము, మనము లోక సంబంధులము కాము. మనము లోక పద్ధతిలో జీవించవలసిన అవసరం లేదు. మన వైఖరి మరియు మన విధానం పూర్తిగా భిన్నంగా ఉండాలి.
ఈ లోకము నిరుత్సాహము మరియు నిరాశయనే కష్టాలకు స్పందిస్తుంది, కానీ యేసు యోహాను సువార్త 14:17 లో మనము నిరుత్సాహ పడవద్దని చెప్తుంది. మన వైఖరి లోక వైఖరి కంటే భిన్నంగా ఉండాలని ఈ వచనం తెలుపుతుంది.
సరియైన వైఖరి ఒక పరిస్థితిని పూర్తిగా తలక్రిందులు చేస్తుందని నేను గుర్తించాను. సరియైన వైఖరి ద్వారా దేవుడు అసాధారణముగా పని చేయుటకు మరియు మీకు సహాయం చేయుటకు ద్వారము తెరవబడుతుంది. సరైన వైఖరి ఏమిటంటే, మీరు ప్రపంచంలో ఉండటానికి అనుమతిస్తుంది, కానీ మీరు దానితో చుట్టబడి యున్నప్పుడు కూడా కాదు.
మనము క్రీస్తులో ఉన్నాము కాబట్టి, జీవితంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రశాంతంగా, నమ్మకంగా సంప్రదించగలమని గుర్తుంచుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను లోకములో ఉన్ననూ నేను లోకమునకు చెందిన వాడను కాను అని చెప్పి యున్నావు. ఈరోజే నేను మీ వైఖరులను మీ మనస్తత్వమును ఎన్నుకొని యున్నాను. ఈలోకపు మనస్సును కలిగి యున్ననూ నేను మీ సమాధానమునకు మరియు క్రీస్తు మనస్సుకు స్పందిస్తున్నాను.