నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. —సామెతలు 4:20
అనేక మంది ప్రజలు దేవుని వాక్యమును ఎలా అధ్యాయనం చేయాలో తెలియజేయమని అడిగి యున్నారు. ఇక్కడ నాలుగు సహాయకరమైన మెట్లు ఉన్నాయి:
- ఉద్దేశ్యపూర్వకముగా సమయాన్ని ఏర్పరచుము. దేవునితో ఉదయకాలమున సమయాన్ని కలిగి యుండుము కానీ అది కుదరని యెడల ఒకవేళ ప్రతిరోజూ కాక పోయినా…. మీకు అనుకూల సమయమును ఏర్పరచుకొనుము. ఎక్కడో ఒక చోట ప్రారంభించండి మరియు అప్పుడు మీ జీవితములో అనుకూల ఫలము ఫలించుట మీరు చూస్తారు!
- మీ బైబిల్ అధ్యాయనమునకు సిద్ధపడండి. మీరు ఏకాంతముగా దేవునితో సమయం గడుపుటకు – మీ ఇంటిలో ఒక గదిని ఏర్పాటు చేసుకోండి.
- మీకు అవసరమైన వస్తువులన్నీ ఉండునట్లు చూసుకోండి. మీరు మీ బైబిల్ కలిగి యుండాలి మరియు ఒక మంచి బైబిల్ నిఘంటువు, కంకార్డెన్స్, పెన్ను మరియు కాగితము. ఆవిధముగా, మీరు రిఫరెన్సు సంబంధిత లేఖనములను సిద్దం చేసుకోండి లేక వాటిని వ్రాసుకోండి.
- మీ హృదయాన్ని సిద్ధ పరచుకోండి. మీరు ఒప్పుకొనవలసిన విషయాలను గురించి దేవునితో మాట్లాడండి మరియు మీ అధ్యాయన సమయంలోనికి మీరు వెళ్ళేటప్పుడు దేవుడు మీతో పంచుకోబోయే ప్రత్యక్షతను పొందుకొనుటకు ఎటువంటి అడ్డంకులు లేకుండా సమాధానముగా ప్రవేశించండి.
మీ జీవితమును మార్చుటకు మరియు దేవుడు ఆశించిన రీతిగా మీరు జీవించునట్లు చేయుటకు దేవుని వాక్యములో శక్తి ఉన్నది కనుక ప్రతి దినము దేవుని వాక్యమును అధ్యాయనం చేయుటకు సమయాన్ని తీసుకొనుము.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, మీ వాక్యమును నిజముగా అధ్యాయనం చేయుటకు సమయాన్ని ఏర్పరచుటకు నేను ఉద్దేశించి యున్నాను. నేను ప్రతి దినము నా జీవితములో మీ సత్యమును ఎలా అర్ధం చేసుకోవాలో, సమ్మతించాలో మరియు ఎలా లోబడవలెనో నాకు బోధించుము.