ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.… —ప్రసంగి 3:1
ప్రసంగి 3:1 మనకు చెప్పునదేమనగా ప్రతిదానికి సమయం కలదు. మనము ఒకే సమయంలో మనమందరమూ ఒకే వాతావరణంలో జీవించము. మీరు విత్తే సమయంలో ఉంటే ఇతరులు పంటను కోసే ఆనందసమయంలో ఉండవచ్చు. ఆ సమయంలో మీ వలె వారు కూడా విత్తే సమయం గుండా వెళ్లి ఉంటారని గుర్తుంచుకోండి.
విత్తే సమయం దేవుని చిత్తమును నేర్చుకొనుటను సూచిస్తుంది. నా ఇష్టము కాక దేవుని చిత్తమును ఎన్నుకొనిన ప్రతిసారీ నా జీవితములో గొప్ప పంటను తీసుకొని వచ్చే మంచి విత్తనమును నేను నాటుతున్నాను.
విత్తే కాలము మరియు కోసే కాలము మధ్య వేచి యుండే సమయం ఉంటుంది. వేర్లు లోపలికి తన్ని నేలలో నుండి వాటి మార్గమును ఏర్పరచుకుంటాయి. ఇది జరుగుటకు కొంత సమయం పడుతుంది మరియు ఇది భూమి లోపల జరిగే ప్రక్రియ. భూమి పై భాగములో ఏమి జరుగుతుందో ఏమి చెప్పలేము.
మనము విధేయతయనే విత్తనము విత్తినప్పుడు ఏమి జరుగడం లేదని అనుకుంటాము, కానీ మనకు కనపడని అనేక విషయాలు అంతర్గతముగా జరుగుతాయి. విత్తనము వలె చివరకు భూమిలో పగిలిపోయి అందమైన ఆకుపచ్చని మొలక వస్తుంది, మన విదేయతయనే విత్తనము చివరకు మన జీవితాల్లో దేవుడు ప్రణాళికయనే అందమైన పంటగా మారుతుంది.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, కోతసమయం రావాలంటే విత్తే సమయం అవసరమని నాకు తెలుసు, కాబట్టి ఏదియు రాదని అనిపించినా నేను ఆశతో ఎదురు చూస్తాను. నీవు సరియైన సమయంలో నా పంటను నా జీవితములోనికి తీసుకొని వస్తారని తెలుసుకొని నేను నీ యందు నమ్మిక యుంచుచున్నాను.