మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. —గలతీ 6:7
ఈ లేఖనము మనకు సాధారణముగా తెలియజేయునదేమనగా మనము దేనిని విత్తుతామో దానినే కోస్తాము. అక్షరాలా, ఇది విత్తనాలను విత్తుట మరియు పంటలను కోయుటను గురించి మాట్లాడుతుంది. అనేక మంది ప్రజలు ఇది డబ్బును గురించి మరియు దాత్రుత్వమును కలిగి యుండుటను గురించి మాట్లాడుతుందని తెలుసు. కానీ ఈ సూత్రము మనము ఇతరులను చూసే విధానమును గురించి కూడా అన్వయించ బడుతుందని మీకు తెలుసా?
మన వైఖరులు మరియు మాటలు అనుదినము మనము విత్తే “విత్తనములు” మరియు అవి మన పరిస్థితులు లేక సంబంధాలలో ఎటువంటి ఫలము లేక పంటను మనము కలిగి యున్నమో నిర్ణయిస్తుంది.
మనము స్వార్ధముగా ఆలోచించుట, యదార్ధమైన స్నేహితులను వారు అంత ప్రాముఖ్యమైన వారు కారని వారితో వ్యవహరించుట, మన కుటుంబములలో పోరాటముతో కూడిన మాటలను విత్తుట, మరియు అధికారులు, సంఘ కాపరులను గురించి వ్యతిరేక ఆలోచనలు ఆలోచించుటతో మనలను తీరిక లేకుండా ఉంచుటకు సాతానుడు ఇష్టపడతాడు. సాతానుడు మన ప్రతి సంబంధము మరియు పరిస్థితిలో మనము చెడ్డ విత్తనము విత్తవలేనని ఆశిస్తాడు.
అనేక మంది ప్రజలు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ప్రజలు ఎందుకు తమను ఇష్టపడటం లేదు లేక తాము ఆశించిన విధముగా ఎందుకు తమను చూడటం లేదని ఆశ్చర్యపోతూ ఉంటారు. జవాబు చాలా సులభం – వారు విత్తిన దానినే కోస్తున్నారు!
ఒకటి మిమ్మల్ని అడగనివ్వండి, ఈరోజు మీరు ఏమి విత్తుచున్నారు? దేవుని కృపతో మీ ప్రతి సంబంధము మరియు పరిస్థితిలో ప్రేమ, క్షమాపణ, దయ మరియు సహనమును విత్తండి. మీరు ఇతరులను దేవుడెలా చూచు చున్నాడో అలాగే చూచుచున్న యెడల మీ జీవితము ప్రోత్సాహము, దైవిక సంబంధములు మరియు తృప్తికరమైన ఫలితములతో నింపబడుటను చూస్తారు.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్దాత్మా, నేను మంచి విషయాలను విత్తి మంచి విషయాలను కోయవలెనని ఆశిస్తున్నాను. ఇతరుల యెడల స్వార్ధముగా ఆలోచించక, నా జీవితములోని ప్రజలందరితో నా సంబంధములలో దయను విత్తుటకు నాకు సహాయం చేయుము.