దేవుడు మీతో ఏమి మాట్లాడుతున్నాడో దానిని వినండి మరియు విధేయత చూపండి

దేవుడు మీతో ఏమి మాట్లాడుతున్నాడో దానిని వినండి మరియు విధేయత చూపండి

వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు! —ద్వితీయోపదేశకాండము 5:29

పరిచర్యలో దేవుడు నాయకులతో మాట్లాడడు. దేవునితో సంబంధమును కలిగియున్న ప్రతి ఒక్కరి జీవితములోని ప్రతి అడుగులో ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. చాలా మంది ప్రజలు దేవుని నుండి వినుటకు ఎదురు చూడరు కానీ వాస్తవముగా, దేవుడు మనందరితో మాట్లాడతాడు. ఆయన మీతో కూడా మాట్లాడుతున్నాడు.

నిజమే, మీరు దేవుని స్వరము వినకుండా మీరు ఆయన చెప్పేది వినలేరు మరియు దానిని పాటించలేరు. మీ బైబిల్ ను చదువుట ద్వారా ఆయన మాటలు వినవచ్చు, సమయం తీసుకొని ఆయన సన్నిధిలో గడపవచ్చు మరియు అనుదినము మీ హృదయమును సిద్ధపరచుకొని ఆయనను ఆహ్వానించవచ్చును. ఆ విధముగా మీరు ఆయన హెచ్చరికలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను పాటించ వచ్చును.
ద్వితీయోపదేశకాండము 5:29 చదవండి. ఆయన ఈ మాట చెప్పేటప్పుడు ఆయన స్వరములోని పట్టుదలను మీరు విన్నారా? ఆయన ఆజ్ఞలను మనము చక్కగా పాటించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మన క్షేమము కొరకు శ్రద్ధ కలిగి యున్నాడు మరియు మనము ఆయన చెప్పేది విని దానికి విధేయత చూపుట ద్వారా మాత్రమే ఆయన మనలను గురించి శ్రద్ధ కలిగి యుండుటకు ఏకైక మార్గమై యున్నది.

యేసు క్రీస్తుతో మీ సంబంధమును మీ జీవిత శైలిగా మార్చుకోండి మరియు నమ్మకముగా వాక్యమును పాటించు వారుగా ఉండండి. ఆయన జ్ఞానమును వినండి మరియు ఈరోజే దానిని అనుసరించండి.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నీవు నాతో మాట్లాడతావని నేను నమ్ముతున్నాను మరియు మీ స్వరమును తెలుసుకొనవలెనని కోరుతున్నాను. నేను ఉద్దేశ్యపూర్వకముగా నేనేమి చేయాలని నీవు నాకు చెప్పి యున్నావో దానిని విని నేను ఆ విధంగా జీవిస్తాను తద్వారా ఇది నాలో చాలా బాగా పని చేస్తుంది.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon