
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై (మీ స్వంత ఆలోచనలతో మిమ్మును మీరు తగ్గించు కొనుడి) యుండుడి. —1 పేతురు 5:6
యేసు మన చింతలను మరియు భారములను ఆయన మీద వేయుటకు యేసు మనలను ఆహ్వానించి యుండగా, మనలో చాల మంది వాటిని వెళ్ళగొట్టుటకు ఎందుకు వెనుకాడుతున్నారు? మనము మన చింత అనే భారమును మోయుట ఎంత భయంకరమైనదో మనము గుర్తించలేము.
మన జీవితాల్లో విజయం కావాలంటే దేవుని జ్ఞానమును అనుసరించుటయే మరియు మనము శాంతిని కలిగి యుండాలంటే చింతించుటను మీరు విడిచి పెట్టవలెను. కాబట్టి మనము పట్టించుకోవలసిన విషయాలు మన మార్గములో వస్తున్నట్లైతే మనకు దేవుని సహాయం అవసరం. మనము దానిని ఎలా పొందగలము? 1 పేతురు 5:6లో మనము తగ్గించుకొనవలెనని చెప్పబడి యున్నది.
చాలా మంది చాలా కఠినముగా ఉంటూ సహాయం అడుగుటకు వెనుకాడుతారు కాబట్టి ఇది చాలా స్పష్టంగా మరియు సులభముగా ఉన్నది. కానీ దీనులు సహాయమును పొందుతారు. కాబట్టి మీ మార్గములో పని జరుగక పోయినట్లయితే దేవుని మార్గములో ఎందుకు పని చేయరు?
మనలను మనము తగ్గించుకొని దేవుని సహాయమును ఆశించినట్లైతే అప్పుడు ఆయన మన పరిస్థితులలో ఆయన శక్తిని కుమ్మరిస్తాడు. అప్పుడే మనము నిజముగా మన జీవితములలో ఆనందిస్తాము. కాబట్టి ఈరోజే మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి మరియు మీ చింతలను గురించి ఆయనే శ్రద్ధ తీసుకొనునట్లు అనుమతించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా స్వంతగా నేను నా జీవితమును ప్రశాంతముగా చేపట్టలేను కాబట్టి, నేను ఈరోజు నన్ను నేను మీ ఎదుట తగ్గించుకొనుచు మీ సహాయం కొరకై ప్రాధేయ పడుచున్నాను. నేను మీ యందు నమ్మిక యుంచి నా జీవితమును మీరే నిగ్రహించుటకు అనుమతించుచున్నాను.