భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. —కొలస్సీ 3:18-19
డేవ్ కు ఉదయ కాలమున ఫ్రూట్ సాలడ్ ఇష్టం. కాబట్టి ఉదయకాలమున నా భర్త కొరకు ఫ్రూట్ సలాడ్ చేయాలనీ దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు.
సమస్య ఏదనగా నేను ఆయన కొరకు ఫ్రూట్ సలాడ్ చేయడం ఇష్టం లేదు. ఎప్పుడూ నేను దీనినే ఆయన కొరకు ఎందుకు చేయాలని ఆలోచిస్తాను. ప్రభువు ఎంతో ఓపికగా నాకు గుర్తుచేస్తున్న దేమనగా ఈ విధముగా నేను నా భర్తకు సేవ చేయుట నిజముగా ఆయనకు సేవ చేయుటయే.
భార్యాభర్తలు ఒకరికొకరు సేవ చేయడం ద్వారా ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉంటే విడాకుల నుండి ఎన్ని వివాహాలు రక్షించబడతాయని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరూ “స్వేచ్ఛగా” ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది, మరియు యేసు మనలను విడిపించాడు. కానీ ఆ స్వేచ్ఛను మనం స్వార్థపూరితంగా ఉపయోగించుకోవాలని ఆయన ఎప్పుడూ ఉద్దేశించలేదు. జీవిత భాగస్వాములకు ప్రేమతో సేవ చేయాలని ఆయన కోరుకుంటాడు.
నేను ఖచ్చితముగా నా భర్తను ప్రేమిస్తాను, మరియు కొన్నిసార్లు ఆ ప్రేమ సేవ చేయుట ద్వారా చుపించవచ్చును. మాటలు అద్భుతమైనవి, కానీ నీవు ప్రేమలో నడచిన యెడల మీ సమర్పణ కూడా క్రియాపూర్వక ప్రేమతో చూపించవలసి ఉంటుంది.
నేను మీ ప్రేమకు వెనుక క్రియలు చేయాలని అర్ధిస్తున్నాను. మీరు మీ జీవిత భాగస్వామికి ఎలా సేవ చేయాలో మరియు వారిని ఈరోజు ఎలా దీవించాలో దేవునిని అడగండి
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నా వివాహములో స్వార్ధముగా జీవించాలని ఆశించుట లేదు. మీరు నన్ను కోరుకుంటున్నట్లు నా జీవిత భాగస్వామికి సేవ చేయడానికి, వారిని కేవలం మాటల కంటే ఎక్కువగా ప్రేమించుటకు నాకు సహాయపడండి.