యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. —యెషయా 11:2-3
యేసు తన జీవితమును వివేచన మీద జీవించాడు. ఆయన వివేచన ఆయన శారీరక అసాధారణ ఆలోచనలను బట్టి కాదు – కానీ అది తండ్రియైన దేవునితో యేసు కలిగియున్న సన్నిహిత సహవాసము మరియు సంబంధము.
అదే వివేచనయనే వరము దేవునితో మనము కలిగియున్న సంబంధము ద్వారా మీకు మరియు నాకు కూడా అందుబాటులో ఉన్నది.
కాబట్టి అది ఎలా పని చేస్తుంది? మీరు ఏదైనా ఒకటి చేయుటకు ముందు, మీరు చేయబోయే పని మీ ఆత్మతో సమతుల్యముగా ఉన్నదా అనే విషయాన్ని సరిచూసుకోండి. అందులో మీకు సమాధానమున్న యెడల అప్పుడు ముందుకు సాగండి. కానీ ఒకవేళ మీరు అసౌకర్యముగా, కలవరముగా లేక నిస్పృహతో ఉన్నట్లయితే నిలకడగా ఉండండి.
ఉదాహరణకు, కొన్నిసార్లు నేను ఒక మాల్ లో ఏదైనా వస్తువు కొనుటకు సిద్ధముగా ఉంటాను, కానీ నేను చెక్ అవుట్ కౌంటర్ వద్దకు రాక మునుపు నేను నా ఆత్మలో నిస్పృహగా భావించినట్లయితే, ఆ భావన ఏదనగా దానిని కొనవద్దని పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడుట.
ఇటువంటి సంఘటనలలో మనము కలిగియున్న ఉత్తేజకరమైన విషయాలేవనగా నీవు మరియు నేను పరిశుద్దాత్మ యొక్క మాటలను అనుసరించుచుండగా మన ఆత్మలు దేవునిలో బలముగా ఎదుగుతాయి మరియు మన జీవితాల్లో ఆత్మ ఫలమును పని చేయునట్లు చేయుటకు దేవుని శక్తి మరి అధికముగా విడుదలగును.
పరిశుద్ధాత్మకు చెవియొగ్గి ఆయన మాటలను అనుసరించుము మరియు యేసు నడచిన వివేచనలోనే మీరు కూడా నడవగలరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నా మిడిమిడి జ్ఞానము లేక స్వార్ధపూరిత కోరికల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవలెనని నేను ఆశించుటలేదు. నేను వివేచనలో నడవాలని ఆశిస్తున్నాను. నేను నిర్ణయములు తీసుకునేటప్పుడు నేను మీతో సంప్రదించి మీ నుండి రాని ఆలోచనలు నిరశపరుస్థాయి మరియు మీ మార్గములు నాకు శాంతిని ప్రసాదిస్తాయి.