… అయితే (నిజమైన) నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును. —హబక్కూకు 2:4
విశ్వాసమనునది మనము అనేక సార్లు ఉపయోగించే పదము, కానీ కొన్నిసార్లు మనము దీనిని చాల క్లిష్టముగా చేస్తాము. విశ్వాసమునకు సులభమైన అర్ధమేదనగా “నమ్మకం లేక సంపూర్ణ విశ్వాసం”; ఈ పదమునకు సమర్పణ లేక నమ్మకత్వమును కూడా సూచిస్తుంది.
మనము కష్టపడుటకు విశ్వాసము అనునది క్లిష్టమైన విషయం కాదు. దేవునిలో ఉండే యదార్ధమైన విశ్వాసము యేసు యొక్క మరణము మరియు పునరుద్ధానము సంపూర్ణముగా నిజమని ప్రకటిస్తుంది. మనమిలా పలికినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది, “ఇది కేవలం నాకు అర్ధవంతముగా ఉండుట మాత్రమే కాదు కానీ, నేను దాని మీద నా జీవితమును కట్టుకొనుటకు అంగీకరిస్తున్నాను.”
నీతిమంతుడు విశ్వాసము మరియు నమ్మకములో రాజీపడకుండా జీవించునని బైబిల్ చెప్తుంది. రాజీపడని నీతిమంతుడు ఆలోచించే ఒక విధానమేదనగా యేసు మరణ పునరుత్తానముల ద్వారా నీతి మంతులుగా చేయబడిన వారిని గురించి ఆలోచించుట.
విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా చేయబడ్డాము మరియు దేవుడు మనలను తన ప్రియమైన చిన్నారులుగా భావించును.
ఈరోజు విశ్వాసపు పునాదులకు తిరిగి రావాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ విశ్వాసమును ఆయనలో ఉంచినప్పుడు మీరు నీతిమంతులగుదురని తెలుసుకొనుము. మీరున్న పరిస్థితిలోనే మిమ్మల్ని తన చాచిన హస్తములతో హత్తుకోనుటకు సిద్ధముగా ఉన్న దేవుని యందు మీ నమ్మకములో జీవించుము.
ప్రారంభ ప్రార్థన
నేను మీలో నా విశ్వాసమును ఉంచి రాజీ పడని నీతిమంతుడుగా ఉన్నందుకు మీకు నేనెంతో కృతజ్ఞత కలిగి యున్నాను. ఈరోజు నేను నీ యందు నా విశ్వాసమును ఉంచి యున్నాను.