
యెహోవా మహా ప్రభావముగలవాడని వారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసెదరు. —కీర్తనలు 138:5
నేను చాల తీవ్రతను కలిగి ఉండేదానిని. నా పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో లేక ఎలా చూస్తారో అనే విషయములో నేను చాల తీవ్రతను కలిగి ఉండే దానిని. నా ఇల్లు ఎలా కనపడుతుందోనని, నేనెలా కనపడతానో అని మరియు ప్రజలు నా గురించి ఏమి ఆలోచిస్తారో అని నేను ఆలోచిస్తూ ఉండే దానిని. నా భర్త ఎలా ఉండాలని నేను ఆశిస్తున్నానో అలా అతనిని మార్చాలనే విషయంలో తీవ్రతను కలిగి యుండేదానిని. నేను తీవ్రత లేని దాని గురించి అసలు నేను ఆలోచించే దానిని కాను. నేను నిజముగా చేయవలసిన పని ఏదనగా నన్ను వెలిగించుటకు నాకు నేను అనుమతిని ఇవ్వవలసి యున్నది!
నేను నా అనుదిన జీవితముతో దేవునిని ఎలా నమ్మాలో నాకు తెలియదు. నేను సమస్తములో సమతుల్యతను తప్పుచున్నాను. వేడుక జరుపుకొనుట మరియు ఆనందించుట అనునది మన అనుదిన జీవితాల్లో అవసరమని నేను గుర్తించలేదు – అది లేకుండా మనము ఆత్మీయముగా, మానసికముగా, ఉద్రేకముగా లేక భౌతికముగా ఆరోగ్యముగా ఉండలేము! వాస్తవముగా, దేవుడు వేడుక జరుపుకొనుట గురించి బైబిల్ లో చెప్పియున్నాడు గనుక అది చాలా ప్రాముఖ్యమైనది. మనము వేడుక జరుపుకొనవలెనని ఆయన అక్షరాలా ఆజ్ఞాపించి యున్నాడు.
మీరు మీ కుటుంబమునకు మరియు మీ ప్రపంచమునకు మీరు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఎదనగా – మీరు ఆరోగ్యముగా ఉండుటయే – మరియు వేడుక జరుపుకొనుట అనునది మీ జీవితములో భాగముగా లేనట్లైతే మీరు ఆరోగ్యముగా ఉండలేరు. ఈరోజు, వేడుకతో మీ జీవితములోని వాతావరణ మంతటిని మీరు పూర్తిగా మార్చి వేయండి. మీరు వెలిగింపబడుటకు మీకు మీరే అనుమతినివ్వండి!
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నేను ఎక్కువ తీవ్రతను కలిగి యుండునట్లు అనుమతించకుము. ప్రతి రోజూ మీ మంచితనమును జ్ఞాపకము చేసుకొనుచు వేడుక జరుపుకొనునట్లు నాకు నేను అనుమతినిచ్చుట జ్ఞాపకమునకు తెచ్చునట్లు నాకు సహాయం చేయుము.