కార్యానుకూలమైన మంచి సమయము (అక్కడ, నా కొరకు ఒక గొప్ప మరియు వాగ్దానపరమైనది) నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును —1 కొరింథీ 16:9
ప్రతి సమయంలో దేవుడు మన హృదయములలో ఒక నూతన ఆలోచనను లేక మన జీవితములలో ఒక దర్శనమును లేక సవాలును అనుగ్రహించును, అక్కడే వ్యతిరేకించుటకు శత్రువు కూడా ఉంటాడు.
దేవుడు మనలను నూతన స్థాయిలోనికి పిలుచును. కొన్ని గొప్పగా మరియు ప్రాముఖ్యమైనవిగా అనిపించవచ్చు; మరి కొన్ని చాల స్వల్పముగా లేక గుర్తింపు లేనివిగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనము దేవునితో నూతన స్థాయిలోనికి చేరినప్పుడు, మన శత్రువైన సాతాను నుండి మనము వ్యతిరేకతలోని నూతన స్థాయిని ఎదుర్కొంటాము.
వ్యతిరేకతతో పాటు అవకాశము కూడా వస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు కాబట్టి మనము భయపడనవసరం లేదు. కొన్ని విషయాలు మనకు చాలా పెద్దవిగా కనపడవచ్చు, కానీ దేవునికి ఏదియు అసాధ్యము కాదు. ఆయన దేనిని గురించి ఆశ్చర్యపడడు లేక భయపడడు, మరియు ఆయనతో మన ఎదుట ఉంచబడిన ఏ సవాలునైనా ఎదుర్కొన గలము.
దేవుడు మిమ్మును పిలిచినా నూతన స్థాయిలోనికి చేరుటకు మీరు నిర్ణయించుకొనినప్పుడు, మీరు వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు విడిచిపెట్టడు. బదులుగా, గొప్ప వ్యతిరేకత ఉన్నట్లయితే మీ ఎదుట గొప్ప అవకాశము ఉందని జ్ఞాపకముంచుకోండి. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు గనుక ధైర్యముగా ఉండండి మరియు పరిశుద్ధాత్మ నుండి ధైర్యమును పుంజుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, వ్యతిరేకతలో నన్ను క్షీణింపజేయకండి. నా యెడల నీకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయని నాకు తెలుసు మరియు గొప్ప ప్రతిపక్షం మాత్రమే గొప్ప అవకాశం అని నాకు తెలుసు. నేను మిమ్మును నమ్ముతున్నాను మరియు నీవు నీ ప్రేమ ద్వారా ఇతరులకు సేవ చేస్తూ, విశ్వాసం యొక్క నూతన స్థాయికి తీసుకువెళ్లగలవని నేను నమ్ముతున్నాను.