నిబ్బరమైన బుద్ధి (క్రమశిక్షణ గల, గంభీరైన మనస్సు) గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. —1 పేతురు 5:8
దేవుడు మీ జీవితమునకు ఒక ప్రణాళికను కలిగి యున్నాడు, కానీ సాతానుడు కుడా మీ కొరకు ఒక ప్రణాళికను కలిగి యున్నాడు. ఫలితముగా మనము నిబ్బరమైన బుద్ధి (క్రమశిక్షణ గల, గంభీరైన మనస్సు) గలవారై ఎల్లప్పుడు మెలకువగా ఉండమని మరియు జగరూకులుగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది.
జాగ్రత్తగా ఉండుట అంటే “క్రమశిక్షణ” కలిగి యుండుట మరియు మనస్సును క్రమపరచుట యనగా “గంభీరముగా” ఉండుట మరియు జగరూకులుగా ఉండుట అనగా “జాగ్రత్త వహించుట” అని అర్ధము. మనమందరమూ ఎల్లప్పుడూ ఈ విధంగానే జీవించవలెను. అది గంభీరమైనది.
మనము శత్రువుతో పోరాడాలంటే గంభీరముగా ఉండాలి. మీ జీవితములో దేవుడెప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా సాతనుడు మీ మీద దాడి చేస్తాడని చూపించినప్పుడు, మీరు వెనక్కి కూర్చొని ఏమి చేయకుండా ఉండే సమయం అది కాదు. ఇది గంభీరతను కలిగి యుండి సాతానుడికి ఎదురుపడే సమయం.
మనము క్రీస్తులో అత్యధిక విజయం సాధించే వారముగా ఉండుట దేవుని ప్రణాళికయై యున్నది. మనము సాతానుడి ప్రణాళికకు బానిసలుగా జీవించవలసిన అవసరం లేదు. మీరు ఏమి చేయవలసి యున్నదో దానిని చేయుటకు మీరు ఇప్పుడే నిర్ణయించుకోండి మీరు దేవునితో గంభీరముగా ఉండండి, పరిశుద్ధాత్మ యొక్క మాటలను అనుసరించండి, మరియు సాతానుడికి వ్యతిరేకముగా మీరు నిలబడండి. మీ జీవితములో సాతానుని ప్రణాళికకు కాక దేవుని ప్రణాళికను అనుసరించుటకు ఈరోజు ఎన్నుకోండి, అప్పుడు మీరు సాతానుడి ప్రతి పనిలో మీరు అతడిని ఓడిస్తారు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను శత్రువు యొక్క ప్రణాళిక కాక మీ ప్రణాళికనే ఎంపిక చేసుకొని యున్నాను. అతడు మిమ్మును ఏ ప్రదేశములో దాడి చేస్తున్నాడో ఆ ప్రదేశములను చుపించండి మరియు అతనిని ఓడించుటకు నన్ను నడిపించండి.